ఒక పక్క తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్, అతని మేనల్లుడు హరీష్, మిగతా తెరాస నాయకులు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం అని, వాళ్లకి ఇస్తే మాకు ఇవ్వాలి అంటూ, చేస్తున్న హడావిడి చూస్తున్నాం. ఇదంతా అక్కడి ప్రజలను మరోసారి ఆంధ్రా మీద విషం చిమ్మించి రాజకీయం చెయ్యటం కోసం. అయితే తెలంగాణా సమాజం మాత్రం, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై సానుభూతితో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కాడు. దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఫైర్‌ సర్వీస్‌ కార్యాలయం వద్ద వరంగల్‌కు చెందిన యువకుడు ఉమేశ్‌రెడ్డి సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు.

tealangana 27072018 2

సమాచారం అందుకున్న పోలీసులు అతనికి కిందికి దించే ప్రయత్నం చేశారు. ఆ యువకుడిని వరంగల్‌కు చెందిన ఉమేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు ఆ యువకుడితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. క్రేన్ సహాయంలో పైకి ఎక్కి అతనితో మాట్లాడారు ఢిల్లీ పోలీసులు. ఆ తర్వాత తెలుగు తెలిసిన తెలుగు జర్నలిస్టులను పైకి తీసుకెళ్లికెళ్లి అతనితో మాట్లాడించారు. అయితే, హోదాపై ప్రకటన చేస్తేనే దిగుతానని, లేదంటే దూకేస్తానని బెదిరింపులకు గురిచేశాడు ఉమేష్. పోలీసులు, జర్నలిస్టులు ఆ యువకుడితో గంటకుపైగా చర్చలు జరిపి అతడ్ని క్షేమంగా టవర్ పైనుంచి కిందికి దించారు.

tealangana 27072018 3

కాగా, గత వారం రోజుల నుంచి అతడు ఏపీ భవన్‌లోనే ఉంటున్నట్లు సమాచారం. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ అనే నినాదాలు చేశాడు ఉమేష్. ఆంధ్రప్రదేశ్ కు మోడీ అన్యాయం చేసారని, అక్కడి ప్రజలు అడుగుతున్నట్టు, ప్రత్యెక హోదా ఇచ్చి తీరాలని, నిరసన తెలిపాడు. ఒక పక్క కెసిఆర్ లాంటి నేతలు, తమ రాజకీయ మనుగడ కోసం, ప్రాంతీయ వాదాన్ని రేపుతుంటే, తెలంగాణా సమాజం మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలబడుతుంది. ఇది నిజంగా సుభాపరిణామం. మోడీ లాంటి బలమైన నేతను, రెండు తెలుగు రాష్ట్రాలు, కలిసి ఎదుర్కోవాల్సిన టైంలో, కెసిఆర్ వెళ్లి మోడీ పంచన చేరాడు. ఇక జగన్, పవన్ సంగతి సరే సరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read