ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దుల్లో, తెలంగాణా సరిహద్దులో ఉన్న రామాపురం క్రాస్ రోడ్డు వద్ద, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఎమర్జెన్సీ వాహనాలను నిలిపి వేస్తున్నారు తెలంగాణా అధికారులు. ఆంధ్రప్రదేశ్ నుంచి 108లో కానీ, ఇతర అంబులెన్స్ లలో కానీ, ఎవరైనా పేషెంట్లని, మెరుగైన వైద్యం కోసం, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకి, తీసుకు వస్తుంటే, ఆ వాహనాలను రామాపురం క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సరైన వైద్యం అందక పోవటం, అలాగే బెడ్లు అందుబాటులో లేకపోవటంతో, ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ వైపు పరుగులు పెడుతున్న ఏపి వారిని తెలంగాణా సరిహద్దులో అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ, అక్కడ హాస్పిటల్స్ నుంచి అనుమతి ఉంటేనే, వారికి తెలంగాణాలోకి అనుమతి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఈ మేరకు తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని, తెలంగాణా పోలీసులు చెప్తున్నారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా కో-వి-డ్ రోగులు కానీ, ఇతర రోగులు కానీ, అక్కడ డాక్టర్లతో మాట్లాడి, అక్కడ వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని, అక్కడ హాస్పిటల్ నుంచి అనుమతి ఉంటే మాత్రమే, అనుమతి ఇస్తున్నారు.

tg 10052021 2

ఈ రోజు మధ్యానం నుంచి మాత్రం, ఆంధ్రప్రదేశ్ నుంచి రోగులను తీసుకు వెళ్ళాలి అంటే మాత్రం, అక్కడ హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ డాక్టర్ దగ్గర అనుమతి పత్రం, ఉంటేనే తాము అనుమతి ఇస్తామని తెలంగాణా పోలీసులు స్పష్టం చేసారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ నుంచి మెరుగైన వైద్యం కోసం, హైదరాబాద్ వెళ్ళే వారు షాక్ కు గురి అయ్యారు. గరికపాడు చెక్ పోస్ట్ వద్దే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ విషయం, అటు వైపు వెళ్ళే వారికి చెప్పి పంపిస్తున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మాత్రం, రోగులు బంధువులు ఈ విషయం తెలుసుకుని నిరాశకు గురి అవుతున్నారు. ఇక్కడ వైద్యం సరిగ్గా అందటం లేదు కాబట్టే, మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందని, ఇలాంటి సమయాల్లో మనుషులు ప్రణాలతో ఆడుకునే హక్కు, ఎవరికీ లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి, ఈ విషయం పై, వైద్యం కోసం వెళ్ళే వారికి వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read