కాళేశ్వరం ప్రాజెక్ట్ లో, జగన మనుషులకు కాంట్రాక్టులు ఇవ్వటం దగ్గర నుంచి చంద్రబాబుని ఎన్నికల్లో దెబ్బ కొట్టటం దాకా, తరువాత ఎన్నికల్లో జగన్ గెలవగానే, జగన్, కేసిఆర్ స్నేహం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు తెలంగాణా నుంచి, మన రాష్ట్రానికి ఒక్క పైసా ఉపయోగం లేకపోయినా, మన నుంచి మాత్రం, తెలంగాణాకు అన్నీ వెళ్ళిపోతున్నాయి. సెక్రటేరియట్ బిల్డింగ్ లు రాత్రికి రాత్రి ఇచ్చేసారు. కనీసం ప్రమాణస్వీకారం కూడా అవ్వకుండా, ఇది జరిగిపోయింది. తరువాత మన గోదావారి నీళ్ళు తెలంగాణాకు తీసుకువెళ్ళే ఆలోచనలు మొదలు పెట్టారు. అలాగే మన బందర్ పోర్ట్, తెలంగణా కడుతుంది అనే వాదన కూడా ఉంది. ఇలా ఏపి తెలంగాణాకు సహాయం చేస్తుంది కాని, ఇప్పటి వరకు అయితే తెలంగాణా నుంచి ఏ లాభం రాలేదు.

telangana 17082019 2

మనకు రావాల్సిన లక్షల కోట్ల ఉమ్మడి ఆస్థులు, విద్యుత్ బకాయలు పై ఎక్కడా సౌండ్ లేదు. అయితే, ఇంత మంచిగా జగన్ ఉంటున్నా, తెలంగాణా నుంచి మాత్రం జర్క్ లు వస్తూనే ఉన్నాయి. మొన్న రాజ్ భవన్, సెక్రటేరియట్, మిగతా ఉమ్మడి ఆస్తులకు సంబంధించి, కరెంటు బిల్ దాదపుగా 290 కోట్లు కట్టమని, తెలంగాణా అధికారులు, మన రాష్ట్రానికి లేఖ రాసారు. 5 ఏళ్ళలో చంద్రబాబుని అడిగే ధైర్యం లేక, ఇప్పుడు మోదలు పెట్టారు. అయితే, ఇప్పుడు తాజగా తెలంగాణా, మన రాష్ట్రానికి మరో షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పై కృష్ణా బోర్డుకు తెలంగాణ రాష్ట్రం ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నుంచి ఎక్కువ నీటిని తరలిస్తుందని, కాని లెక్కల్లో మాత్రం తక్కువగా చూపిస్తోందని ఫిర్యాదులో చేసారు.

telangana 17082019 3

పోతిరెడ్డిపాడు దగ్గర ఈ దందా జరుగుతుందని, అయితే జాయింట్‌ టీమ్‌ను ఇక్కడకు ఏపి అధికారులు రానివ్వడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7.28 టీఎంసీలు తరలించినట్లు చెప్తుందని, టెలిమెట్రీ యంత్రాల రికార్డు చూస్తే మాత్రం 9.24 టీఎంసీలు తరలించినట్టు అర్ధమవుతుందని ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ పై చర్యలు తీసుకోకపోతే మీకు విశ్వసనీయత ఉండదని తెలంగాణా , కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ప్రస్తుతం వరదలు పోటేత్తుతున్నాయి. ఈ సమయంలో ఎవరు వాడినా, వాడకపోయినా, నీళ్ళు అన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇలాంటి టైంలో కూడా తెలంగాణా, మీరు వాడుకోకూడదు, సముద్రంలోకి వెళ్ళినా పరవాలేదు అనే ధోరణిలో ఉంది. ఇలాంటి వైఖరి ఉన్న వాళ్లతో, గోదావరి నీటిని తరలిస్తామని జగన్ గారు చెప్తున్నారు అంటే, మన పరిస్థితి భవిషత్తులో ఎలా ఉంటుందో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read