ఎన్నికల సమరంలో అప్పుడప్పుగూ కొన్ని విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. కానీ ప్రముఖుల ప్రచారాలు, వివాదాల మధ్య అవి పెద్దగా హైలెట్ కావు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ సాయంతో ఏపీని దెబ్బకొట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారంటూ చంద్రబాబు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ఆయన హైలెట్ చేస్తూ కేసీఆర్‌పై మండిపడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు కేసీఆర్ సైతం ధీటుగానే స్పందిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ కేసీఆర్‌గా మారాయంటూ రాయకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

madhav 20032019

ఇంత రాజకీయ గందరగోళం మధ్య తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం ఇప్పుడూ అందరినీ ఆకర్షిస్తోంది. గతంలో తెలంగాణ ఎమ్మెల్యే పనిచేసిన సున్నం రాజయ్య ఈ ఎన్నికల్లో ఏపీలోని రంపచోడవరం నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. తెలంగాణ వ్యక్తి ఇక్కడెలా పోటీ చేస్తున్నారన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. అసలేం జరిగిందంట.. సున్నం రాజయ్య 2014లో ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. దీంతో రాజయ్య స్వగ్రామమైన వీఆర్ పురం మండలంలోని సున్నంవారిగూడెం రంపచోడవరం నియోజకవర్గంలో కలిసింది. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో భాగంగా రంపచోడవరం స్థానం సీపీఎంకు దక్కింది. దీంతో ఆ పార్టీ తరపున సున్నం రాజయ్య బరిలో దిగుతున్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే రెండు రాష్ట్రాల అసెంబ్లీలోనూ అడుగుపెట్టిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read