జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఎలాంటి స్నేహం ఉందొ అందరికీ తెలుసు. అయితే జగన్ మోహన్ రెడ్డి సియం అయిన తరువాత, అది వ్యక్తిగతం దాటి, ఏకంగా రెండు రాష్ట్రాల దాకా వెళ్ళింది. ప్రమాణస్వీకారం కూడా చెయ్యకుండా, జగన్ మోహన్ రెడ్డి, మన ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన సెక్రటేరియట్ భవనాలను కేసీఆర్ కు భేషరతుగా అప్పచెప్పారు. ఇప్పుడు తాజాగా ఏకంగా గోదావరి జలాలు మళ్ళించటానికి, మన ఆంధ్రప్రదేశ్ చేత, తెలంగాణా భూభాగంలో ప్రాజెక్ట్ కట్టించి, చెరి సగం పంచుకుందాం అంటున్నారు. ఇలా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అన్నీ ఇచ్చేస్తున్నారు కాని, తెలంగాణా నుంచి మాత్రం మనకు రావలసిన లక్ష కోట్ల ఉమ్మడి ఆస్థులు, విద్యుత్ బకాయలు మాత్రం, రావాటం లేదు. కేసిఆర్ గురించి తెలిసిన వారు, జగన్ ను హేచ్చిస్తున్నారు కూడా.

kcr 04082019 2

తన పార్టీని విలీనం చేస్తాను అని చెప్పి సోనియా గాంధీని, దళిత సియం అంటూ ప్రజలను, కేసీఆర్ ఎలా మోసం చేసారో చెప్తున్నారు. నమ్మించి మోసం చేస్తారు జాగ్రత్తా అని జగన్ తో ఎంత చెప్పినా, జగన్ మాత్రం వినటం లేదు. కారణం ఏంటో తెలియదు కాని, కేసీఆర్ ఏది చెప్తే అది అన్నట్టు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. 2014 నుంచి, అంటే ఏపి విభజన జరిగిన దగ్గర నుంచి, హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణకు ఖర్చులు అన్నీ తెలంగాణా ప్రభుత్వమే పెట్టుకుందని, రూల్స్ ప్రకారం, ఏపి కూడా తన వాటా ఇవ్వాలని, మొన్నటి దాక చంద్రబాబుని అడగే ధైర్యం లేదు కాబట్టి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని, ఈ ఖర్చుల్లో, ఏపి వాటా అడుగుతుంది తెలంగాణా ప్రభుత్వం.

kcr 04082019 3

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయం నుంచి, ఇప్పటి వరకు, హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్వహణకు 42:58 నిష్పత్తి ప్రకారం ఖర్చులు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం కోరుతుంది. దీని ప్రకారం, 58 శాతం వాటాతో, ఆంధ్రప్రదేశ్ 290 కోట్లు కట్టాలని, తెలంగాణా ప్రభుత్వం అంటుంది. రాజ్ భవన్ లో అయిన ఖర్చులో ఏపి వాటా రూ.25 కోట్లు, హైకోర్టు నిర్వహణ ఖర్చులో, ఏపి వాటా రూ.230 కోట్లగా తేల్చి, ఏపి రాష్ట్ర ఆర్థిక శాఖకు వివరాలు పంపించారు. అంతే కాదు, తెలంగాణా నుంచి విద్యుత్ వాడుకున్నందుకు రూ.2,406 కోట్లు ఇవ్వాలని కూడా కోరారు. ఇదంతా బాగానే ఉంది. తెలంగాణా ప్రభుత్వం రూల్స్ ప్రకారం అడుగుతుంది. మరి మన ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది ? మన విద్యుత్ బకాయలు 5 వేలు కోట్లు ఇవ్వాలని ఎందుకు తెలంగాణాను అడగరు ? ఇలాంటి విభజన హామీలు, ఏపికి రావాల్సినవి ఎన్నో ఉన్నాయి. అయినా ఏపి ప్రభుత్వం మాత్రం, తెలంగాణాను అడగటం లేదు అనే అభిప్రాయం ఉంది. చూద్దాం ఏపి ప్రభుత్వం, తెలంగాణాను రావాల్సిన బకయాలు గురించి అడుగుతుందో, లేక తెలంగాణా ఇవ్వమన్న డబ్బులు ఇచ్చేస్తుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read