జగన్ మోహన్ రెడ్డికి, సిబిఐ కోర్ట్ లు చిక్కు ఎదురు అవ్వటంతో, ఇప్పుడు ఆయన తెలంగాణా హైకోర్ట్ గడప తొక్కారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినిహాయింపు ఇవ్వాలని కోరుతూ, ఆయన తెలంగాణా హైకోర్ట్ మెట్లు ఎక్కారు. ఈ మేరకు ఆయన నిన్న హైకోర్ట్ లో పితీశంవ్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై ఈ రోజు వాదనలు జరిగాయి. అయితే ఈ కేసు పై, సిబిఐ తమకు కౌంటర్ వెయ్యటానికి టైం కావాలని చెప్పటంతో, ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 6 లోపు తమకు కౌంటర్ ఇవ్వాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఇదే సందర్భంలో, సిబిఐకి హైకోర్ట్ మరో ఆదేశాలు కుడా ఇచ్చింది. జగన్ వ్యక్తిగత మినహాయింపు కేసు హైకోర్ట్ లో ఉందని, సిబిఐ కోర్ట్ కు చెప్పండి అంటూ, హైకోర్ట్ సిబిఐ ని ఆదేశించింది. అంటే దీని ప్రకారం, హైకోర్ట్ ల కేసు తేలే వరకు, జగన్ సిబిఐ కోర్ట్ కు వెళ్ళనవసరం లేదు. మొన్న జరిగిన వాయిదాలో, సిబిఐ కోర్ట్, ఏ1 గా ఉన్న జగన్, రేపు వాయిదాకి అంటే, జనవరి 31న వాయిదాకు కచ్చితంగా రావాలని, లేకపోతే సరైన ఆక్షన్ తీసుకుంటాం అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్ట్ ఆదేశాల ప్రకారం, అవసరం లేదు అని జగన్ తరుపు న్యాయవాదులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న తాను ప్రజా సంక్షేమం కోసం నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడం అవసరమని అంతే కాకుండా విజయవాడ నుండి హైదరాబాద్ లో ఉన్న సీబీఐ కోర్టు కి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి హోదా లో హాజరవ్వడానికి 60 లక్షలు అవుతోంది.అంత ప్రజాధనం వృధా కావడం అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మంచిది కాదు అని జగన్ తరపు న్యాయవాది సిబిఐ కోర్టులో అప్పీల్ కి వెళ్లడం దానిని సిబిఐ కోర్టు తిరస్కరించడం అందరికి విధితమే.ఈ నేపథ్యంలో హై కోర్టులో మరో సారి బలంగా వాదనలు వినిపించడానికి జగన్ తరపు న్యాయవాదులు సిద్ధం అవుతున్నారు.త్వరలో మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి అవుతుంది.ఒక వేళ కోర్టు కేసులతో ఆలస్యం అయినా సీఎం క్యాంపు కార్యాలయం వరకూ మొదటి దశ లో మార్చుకోవాలని జగన్ భావిస్తున్నారు.
ఇప్పుడు ఇదే అంశం సిబిఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది అని జగన్ తరపు న్యాయవాదులు భావిస్తున్నారు.ఈ సారి మరింత బలంగా వాదనలు వినిపించడానికి సిద్ధం అవుతున్నారు.విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లడానికి 275 కిలోమీటర్లు.పూర్తి స్థాయి యంత్రంగా తో ముఖ్యమంత్రి వెళ్ళడానికి 60 లక్షలు అవుతుంది.ఇప్పుడు ఆయన కార్యాలయం విశాఖ కు మారింది విశాఖపట్నం నుండి హైదరాబాద్ సీబీఐ కోర్టు మధ్య దూరం 622 కిలోమీటర్లు.అంటే సుమారుగా ఇప్పుడు 1 కోటి 25 లక్షలు అవుతుంది.నెలకి సుమారుగా 5 కోట్లు సంవత్సరానికి 60 కోట్లు,5 ఏళ్లకు గాను 300 కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది.ముఖ్యమంత్రి జగన్ సంవత్సరానికి 60 కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది అంటూ మండలి ని రద్దు చేసారు.ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు గుర్తించి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చేలా హై కోర్టు లో కొత్త వాదనలతో అప్పీల్ కు వెళ్లాలి అని జగన్ తరపు న్యాయవాదులు నిర్ణయించారు.ఈ వాదనతో ఖచ్చితంగా మినిహాయింపు వస్తుంది అని జగన్ తరపు న్యాయ వాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.