ఇప్పటి వరకూ పర్యటనలు, యాత్రలకే పరిమితమైన జనసేన పార్టీ తాజా పరిణామాలతో జవసత్వాలు నింపుకునే ప్రయత్నం చేస్తుంది. కలిసినడుద్దామంటూ వామపక్షాలు ఇచ్చిన ఆఫర్ ను జనసేనాని అందుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా పలు కార్యక్రమాల్లో ఉమ్మడిగా పాల్గొనడంతో పొత్తులు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ప్రణాళికలను సిద్దం చేశారు. ఎన్నిక లకు ఎవరిని బరిలోకి దింగాలనే అంశాలపైన పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించినా ఇంకా దీని పై కచ్చితమైన క్లారిటీ ఇంత వరకూ ఇవ్వలేదు. సాధారణ ఎన్నికల్లో పోటీచేసే స్థానాల్లో సీట్లసర్దు బాటు కూడా వామపక్షాలతో ఉంటుందని పార్టీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. వామపక్షాలకు బలంగా ఉన్నచోట్ల పోటీలోకి దిగే విషయమై జనసేన పార్టీతో త్వరలో భేటీ అయ్యే ఆవకాశం ఉందని అంటున్నారు.

pk kcr 14082018 2

కాగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ చేరికలపై ఎలాంటి తొందర పడడం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేరిక పై జనసేన వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అనుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించిన పవన్ కల్యాణ్ అందుకు తగినట్లుగా వ్యూహరచన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జనసేన పార్టీ ప్రవేశానికి కట్టుదిట్టమైన ప్రణాళికలతో పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నట్లు సమాచారం. పార్టీలోకి ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరితో కలిగే ఉపయోగాలు ఏంటి అనే అంశాలపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

pk kcr 14082018 3

ఆంధ్రాలో పవన్ కల్యాణ్ తో సీపీఐ, సీపీఎంలు జట్టు కట్టడంతో ఆంధ్రప్రదేశ్లో మూడో ప్రత్యామ్నాయం ఖాయమని తేలిపోయింది. ఇంతకాలం ప్రశ్నించేందుకే జనసేన అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎన్నికల గోదాలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మంచి దూకుడు మీద ఉన్న పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రం విషయంలో మాత్రం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అడపాదడపా తెలంగాణ రాజకీయాల పై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్ ఇక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణంపై మాత్రం తొందరపడడం లేదు. పార్టీలో చేరుతామని ముందుకు వస్తున్న నాయకుల పట్ల సైతం ఆయన పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు.

pk kcr 14082018 4

అందుకే మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులతో భేటీని చివరి నిముషంలో రద్దు చేశారు. మెత్కుపల్లి గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి, దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో మోత్కుపల్లికి జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణ శాఖలో కీలక బాధ్యతలు అప్పచెబుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే కెసిఆర్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల మోత్కుపల్లి చేరికను పవన్ కల్యాణ్ వాయిదా వేశారు. మోత్కుపల్లి, కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చెయ్యటమే దీనికి కారణం.

pk kcr 14082018 5

ఎలాగూ తెలంగాణలో కెసిఆర్ నర్కార్ కు అనుకూలంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు కితాబునిచ్చారు. అలాంటప్పుడు పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాల్సిన అవసరం ఇప్పటికప్పుడు అయితే జనసేన పార్టీకి లేదు. మరోవైవు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ కళ్యాణ్ ను వినియోగించుకోవాలనే యోజనలో టీఆర్ఎస్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకూలంగా పలు నియోజకవర్గాల నుండి అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీకి కూడా అనుకూలంగా ఉండటంతో, బీజేపీ వైపు నుంచి కూడా, పవన్ కు ఇబ్బంది లేదు. అందుకే, అందరూ చట్టాపాట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అవుతున్నారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read