మన బ్రతుకు మనం బ్రతుకుతున్నా ఇంకా మన మీద పడి ఏడుస్తూనే ఉన్నారు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో, మీ కళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే, నేను నా పంటితో తీస్తాను అని హైదరాబాద్ లో ఓట్లు కోసం కబ్రులు చెప్తే, ఆయన ఎమ్మల్యేలు మాత్రం, ఆంధ్రా వారి మీద దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు... సాక్షాత్తు ఎమ్మల్యేలే ఇలా ప్రవర్తిసుంటే, ఇక చోటా మోటా నాయకులు ఎలా ప్రవరిస్తారో అర్ధం చేసుకోవచ్చు... ఈయన తెలంగాణ రాష్ట్రం, నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం... ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అధికారి రూల్స్ ప్రకారం పని చేసినందుకు, పచ్చి బూతులు బహుమనగంగా ఇచ్చారు... రాష్ట్రం విడిపోయినా, నవ్వు ఆంధ్రావాడివి, మాకు సలాం కొట్టాల్సిందే అంటున్నారు...

telangana mla 10122017 2

ఆంధ్రా అధికారివి... నీయయ్య నాకే ఎదురొస్తావా?" అంటూ పరుషపదజాలంతో దూషించారు. ఈ ఎమ్మెల్యే బూతుపురాణానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళ్తే, నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీజీఎం లక్షమ్మ నిధుల దుర్వినియోగం కేసులో సస్పెండ్ అయింది. ఆమె తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓ మదన్ మోహన్‌కు వేముల వీరేశం ఫోన్ చేశాడు. ఈ విషయం తన పరిధిలోది కాదని సీఈవో సమాధానం ఇస్తుండగానే, "నా మాటకే ఎదురు చెప్తావా... ఆంధ్రా అధికారివి" అంటూ నోరు జారారు...

telangana mla 10122017 3

అంతటితో ఆగకుండా బండ బూతులు తిట్టారు. నేనడిగిన పని చేయకుంటే అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన మాటకే ఎదురు చెబుతావా అంటూ నోటికి పని చెప్పాడు.పని కోసం10 లక్షలు డిమాండ్ చేస్తున్నావని నీ పై అధికారులకు పిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. కాగా... ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో కాస్త ఆదివారం లీకైంది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా... ఇంత రచ్చ అవుతున్నా, అతను తన చర్యను సమర్ధించుకుంటున్నారు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు ఎన్నో అవమానాలు ఎదురుకున్న సంగతి తెలిసిందే... చివరకు కార్యాలయాల్లోకి వెళ్లి కొట్టారు కూడా... అన్నీ మర్చిపోయి ఎవరు బ్రతుకు వారు బ్రతుకుంటే, ఇప్పటికీ ఆంధ్రా వాడు అంటూ తెలంగాణలో ఎమ్మల్యే స్థాయి వారే దాడులు చేస్తున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read