తెలంగాణ రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజం నెలకొంది. టిడిపి అధ్యక్షుడు బక్కని నర్సింహులు స్థానంలో కాసాని జ్కానేశ్వర్ ని నియమించడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో చలనం మొదలైంది. ఇప్పటివరకూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అవి ఫోకస్ కాలేదు. దీంతోపాటు ఇప్పటివరకూ పార్టీ నుంచి బయటకు వెళ్లేవారే కానీ, వచ్చేవారు పెద్దగా లేరు. ఇటీవలకాలంలో లీడర్ల నుంచి కేడర్ వరకూ భారీగా టిడిపిలో చేరేందుకు క్యూకడుతున్నారు. టిడిపి నుంచి వెళ్లి ఇతర పార్టీలలో ఇబ్బందులు పడుతున్న బడానేతలు కూడా టిడిపి వైపు చూస్తున్నారని సమాచారం. తెలంగాణలో అధికారంలోకి వస్తాం అనే పెద్ద మాటలు నేతలు చెబుతున్నంత లేకపోయినా గెలుపు ఓటములు శాసించే స్థాయి చాలా నియోజకవర్గాలలో ఉంది.

ఇదే సమయంలో ముందస్తు ఎన్నికల కోలాహలం నెలకొంది. రాజకీయ పార్టీలు అటు నుంచి ఇటు..ఇటు నుంచి అటు జంపింగ్లు మొదలయ్యాయి. టిడిపిలో చేరికలు జోరందుకున్నాయి. హైదరాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాల నుంచి 500 మంది నాయకులు టిడిపిలో చేరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గ నాయకులు టిడిపిలో చేరారు. తెలంగాణా తెలుగుదేశం స్పీడ్ అందుకోవటం వెనుక వ్యూహం ఎవరికీ అంతుబట్టటం లేదు. తెలంగాణాలో టిడిపితో పొత్తు పెట్టుకునే విషయం పై బీజేపీ ఆలోచిస్తున్న సమయంలో, టిడిపి తన బలాన్ని చూపిస్తుంది. తెలంగాణాలో మారే సమీకరణల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పడితే, తెర వెనుక వైసీపీతో స్నేహం చేస్తున్న ఏపి బీజేపీ నేతలకు ఇబ్బందే మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read