ఓటు వెయ్యండి.. ఓటు హక్కు.. ఇలా అనేక ప్రకటనలు వారం నుంచి ఈసి చేసింది... ఈ ప్రయత్నం చాలా మంచిది... కాని, ఓటు వెయ్యటానికి వచ్చిన వారికి, ఓటు వేసే అవకాసం కూడా ఇవ్వలి కదా.. అసలకే హైదరాబాద్ లాంటి చోట, ఓటింగ్ కి రావటమే ఎక్కువ... అలాంటిది, వచ్చిన వాళ్లకి ఓటు వేసే అవకాసం లేకుండా, ఈవీఎంలు మొరాయించటం, లైటింగ్ లేకపోటం, ఇవన్నీ చూసి వెళ్ళిపోతున్నారు... హైదరాబాద్ తో పాటు, తెలంగాణాలోని చాలా చోట్ల పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది. ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ స్టార్ట్ అయింది, దీంతో అంత సేపు లైన్ లో నుంచేనే ఓర్పు లేక కొంత మంది వెళ్ళిపోయారు. కూకట్‌పల్లి,శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పల్లు జిల్లాల్లో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అంతరాయం కలిగింది.
పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీ పలు నిషేదాజ్ఞాలు విధించింది. బూత్‌లోకి సెల్ ఫోన్స్‌కు అనుమతి నిరాకరించారు. అలాగే మద్య సేవించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం నిషేదించారు. కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. దీంతో కొంతమంది తమ మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించక పోవడంతో తిరిగి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాల బయట మొబైల్ ఫోన్లను దాచి పెట్టేందుకు సౌకర్యం లేకపోవడంతో పలువురు ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని ఎన్నికల అధికారులు ముందుగా ప్రకటించినా, కనీసం పోలింగ్ కేంద్రాల ముందు ఫోన్ల డిపాజిట్ చేసి వెళ్లేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఇలా అనేక చిత్ర విచిత్రాల మధ్య ఓటింగ్ జరుగుతుంది.
మరొక గంటలో అన్నీ సెట్ అవుతాయని ఈసీ చెప్తుంది. అయినా, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాన వాడు, మళ్ళీ రారు కదా. ఓర్పుగా లైన్ లో నుంచునే ఓపిక మన జనాలకి లేదయ్యె. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుండగా, 2.81 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.41 కోట్ల మంది పురుష ఓటర్లు, 1.40 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 7.5 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు వేయనున్నారు. 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అందుకోసం ఈ స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.