ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై, మరోసారి తమ ద్వేష వైఖరిని బయట పెట్టింది తెలంగాణా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా బోర్డుకు తెలిపింది. వేసవిలో తాగునీటి అవసరాల కోసం 3 టీఎంసీల నీటిని కేటాయించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, బోర్డును కోరింది. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, పై నుంచి నీరు రాకపోవటంతో, ప్రతి ఏడాదికి ఏపి తీవ్ర ఇబ్బందులు పడుతుందని, లేఖలో ప్రస్తావించారు. దీనిపై అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి బోర్డు సూచించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు శుక్రవారం బోర్డుకు లేఖ రాశారు.
‘ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తనకు కేటాయించిన దానికంటే ఎక్కువ నీటిని ఉపయోగించింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఉపయోగించుకోవడానికి 10.383 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో నీటి ఆవిరి రూపంలో పోనూ, మిగిలే నీరు తెలంగాణకే చెందుతుంది. వేసవిలో మిషన్ భగీరథ, తాగునీటి అవసరాల కోసం ఈ నీరు తెలంగాణకు కావాల్సి ఉంటుంది. రిజర్వాయర్లలో మిగిలిన నీరు తెలంగాణకు కేటాయించిన కోటాలోనే ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీకి ఎలాంటి నీటి కేటాయింపుల్ని చేయవద్దు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్ 423.428టీఎంసీలను ఉపయోగించుకుంటే.. తెలంగాణ 204.150టీఎంసీలను వాడుకుందని చెప్పారు. కాగా, తెలంగాణ లేఖను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వానికి బోర్డు శుక్రవారం లేఖ రాసింది.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఉండవలిసిన జగన్ మాత్రం, హైదరబాద్ లోటస్ పాండ్ లో ఎంజాయ్ చేస్తూ, ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కుంటున్న నీటి ఎద్దడి పై మాత్రం కనీసం స్పందించలేదు. చంద్రబాబు సియం హోదాలో, ఈ నీటి ఎద్దడి పై సమీక్ష చేస్తే, దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కు చెప్పి, జగన్ మోహన్ రెడ్డి అడ్డుకున్న విధానం ప్రజలు చూసారు. చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగితే, ఎదో ఒక పరిష్కారం లభిస్తుందని తెలిసినా, జగన్ మాత్రం ఆయన్ను అడ్డుకున్నారు. పోనీ, జగన్ మోహన్ రెడ్డి ఏమైనా ప్రజల తరుపున మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. తనకు స్నేహితుడు అయిన కేసీఆర్ తో మాట్లాడి, అలా లేఖ రాయకండి, మా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, అని కేసీఆర్ తో మాట్లాడవచ్చుగా ? అలా కాకుండా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, ఈయన మాత్రం అదే హైదరాబాద్ లో సినిమాలు, షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.