ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడున్నర ఏళ్లలో రెండు డిఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసి, సుమారు 20 వేలకు పైగానే ఉపాధ్యాయల పోస్టుల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు భిన్నంగా గత మూడున్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయక, ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకపోవం పట్ల తెలంగాణా రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల బిఇడి, డిఈడి పూర్తి చేసిన టీచర్ అభ్యర్ధులు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణా యువత చంద్రబాబు ఫోటోలోకి పాలాభిషేకాలు చేస్తున్నారు...

telangana 09122017 2

ఇప్పటికే ఏడాది క్రితమే మొదటి డిఎస్సీ నిర్వహించి 10 వేల వరకు టీచర్ ఖాళీలను భర్తీ చేసిన ఏవీ ప్రభుత్వం తాజాగా రెండో డిఎస్సీని ప్రకటించి 12,370 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రకటన చేసి రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2012లోనే డిఎస్సీ నిర్వహించి టీచర్ల ఖాళీలను భర్తీ చేశారు. అదే ఆఖరి డిఎస్సీ. గత ఐదు సంవత్సరాలుగా ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. రాష్ట్రం విడిపోయి మూడున్నర ఏళ్ల పూర్తవుతున్నా తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే నాలుగు, ఆయిదు సార్లు డిఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు హడావడి చేయడం, ఎదో కారణాలతో వాయిదా పడటం జరుగుతోంది.

telangana 09122017 3

ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో తెలంగాణలోని నిరుద్యోగులు నిరాశతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘పొరుగు రాష్ట్రంలో రెండో నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఇంకా తొలి నోటిఫికేషనే పూర్తి కాలేదు. టీఎస్‌పీఎస్సీకి మాత్రం మూడు రెట్లు జీతాలు పెంచారు’ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థుల ఉద్యమాలతో గద్దెపై కూర్చున్న దొంగలు ఇప్పటికైనా మారాలని డిమాండ్ చేశారు... తెలంగాణా సమాజం, ముఖ్యంగా యువత ఇలా స్పందిచటం నిజంగా ఆశ్చర్యం... ఆయన విలువ ఇప్పుడు తెలుస్తుంది వారికి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read