వరుస వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ, విమర్శల పాలవుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలుగు మీడియా తీసేసి, అలాగే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట ఎక్కడా అధికారిక కార్యక్రమాల్లో వినిపించకుండా, తెలుగు భాష పై వివక్ష చూపుతుంది అంటూ, ఏపి ప్రభుత్వం పై విమర్శలు వస్తున్న తరుణంలో, ఇప్పుడు మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ అంటే అది ఒక బ్రాండ్. పిల్లల పుస్తకాలు కూడా తెలుగు అకాడమీ పేరుతోనే ప్రింట్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ బ్రాండ్ కనుమరుగు అయిపొయింది. తెలుగు అకాడమీని, తెలుగు sanskrit అకాడమీగా పేరు మారుస్తూ, నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సతిశ్ చంద్ర, జీవో నెంబర్ 31ని నిన్న విడుదల చేసారు. ఈ తెలుగు అకాడమీలో, తిరుపతిలో ఉండే sanskrit యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని, గవర్నింగ్ బడీ మెంబెర్ గా కూడా నియమించారు. అయితే తెలుగు ఆకడమీని ఈ విధంగా మార్చటం పట్ల, భాషాభిమానులు అంతా తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని, డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని మరో తుగ్లక్ నిర్ణయంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టిడిపి నేత మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు అకాడమీ పేరు మార్చటాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
తెలుగుకు తెగులు పట్టించే నిర్ణయం ఇది అని చెప్పి, ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు విషయాల్లో, తెలుగు అకాడమీకి సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవాని ఆయన వ్యాఖ్యానించారు. గత కొన్ని దశాబ్దాలు క్రితం, తెలుగు అకాడమీ ఎందుకు పెట్టారు, దాని లక్ష్యం ఏమిటి అనేది, ఈ నాటి ప్రభుత్వానికి తెలియటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం తెలుగు భాషను అభివృద్ధి చేయాల్సింది పోయి, తెలుగు భాషను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని, వ్యాఖ్యానించారు. వెంటనే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవలని మండలి బుద్ధ ప్రసాద్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఈ అకాడమీని అప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయి, అయితే ఇప్పుడు అసలు సంస్కృతం ఎందుకు, మన తెలుగు అకాడమీలో పెట్టారని, ఈ నిర్ణయం వెనుక, ప్రాతిపదిక ఏమితో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీని పై తెలుగు అకాడమీ చైర్మెన్ గా ఉన్న లక్ష్మీ పార్వతి ఎలా స్పందిస్తారో చూడాలి. లక్ష్మీ పార్వతి పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి.