ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం ప్రధాని మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే పర్యటనకు ముందు ఎన్టీఆర్‌పై ఆసక్తికర ట్వీట్ చేశారు. సాయంత్రం తాను కర్నూలులో ప్రసంగించబోతున్నానని తెలిపారు. మహోన్నత ఎన్టీఆర్‌ ఆదర్శాలకు నీళ్లొదిలారన్నారు. మోసపూరిత టీడీపీ పాలనలో ఏపీలో అవినీతి... బలహీనమైన పరిపాలనతో ఏపీ అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉందని వ్యాఖ్యానించారు. యువత కలలు నెరవేర్చడానికి ‘నేను ఏపీ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు’ మోదీ ట్వీట్ చేశారు. దీని పై చంద్రబాబు కూడా అదే విధంగా ఘాటుగా ట్వీట్ చేసారు. రాష్ట్ర విభజనతో కుదేలైన ఏపీకి అండగా ఉంటానని వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ మాట ఇచ్చారని... మాటను నిలబెట్టుకోకుండా, ఏపీకి నమ్మక ద్రోహం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.

moditweet 29032019 1

ఆర్థిక నేరస్థులతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. లక్ష కోట్లు దోచుకున్న ఆంధ్ర నేరస్తులను కటకటాల వెనక ఉంచుతానన్న మోదీ ఇప్పుడు వారితోనే జతకట్టారని విమర్శించారు. ఒక్క విభజన హామీని కూడా అమలు చేయని మోదీ... సిగ్గులేకుండా వైసీపీకి సాయం చేయడానికి ఏపీకి వస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు మేలుకోవాలని... రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను, యువతను, రైతులను, వ్యాపారులను, మైనార్టీలను సంక్షోభంలోకి మోదీ నెట్టేశారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. మాట నిలబెట్టుకోవడం చేతకాక ఏపీకి నమ్మక ద్రోహం చేసిన మోదీ.. ఆర్థిక నేరస్థులతో కలిసి కుమ్మక్కయ్యారనిచంద్రబాబు విమర్శించారు.

moditweet 29032019 1

విభజన గాయాలతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంకన్న సాక్షిగా మోదీ మాటిచ్చారని మరోసారి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని, లక్ష కోట్లు దోచుకున్న స్కామాంధ్ర ఆర్థిక నేరస్థులను కటకటాల వెనుక ఉంచుతానన్న మోదీ.. ఇప్పుడు వారితోనే జట్టుకట్టారని ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. చంద్రబాబుతో రాష్ట్రం బంగారు భవిష్యత్‌ వైపు అడుగులు వేస్తుందని మోదీనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్ఠు పట్టించడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులను, యువకులను, వ్యాపారులను, మైనారిటీలను, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా.. వైకాపాకు సాయం చేయడానికి నిస్సిగ్గుగా మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు మేల్కోవాలని, ధర్మపోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read