వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు, ఒక్కోటి ఒక్కో సెన్సేషన్ అనే చెప్పాలి. ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని కూడా లేకుండా, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. తమ పై ఉన్న కేసులును, తమ సొంత ప్రభుత్వమే ఎత్తేస్తుంది. కోర్టుల వరకు వెళ్లి, తప్పో, రైటో కోర్టులు చెప్పాలి కానీ, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మాత్రం, తమ సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. వివిధ సందర్భాల్లో, నేతల పై వివిధ కేసులు పెడుతూ ఉంటుంది ప్రభుత్వం. అలా పెట్టిన కేసులు, తమకు అధికారం రావటంతో, ప్రభుత్వం ఆ కేసులు ఉపసంహరించుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే ఇలా అనేక కేసులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టేసిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న కేసు కూడా ఈ మధ్య ఇలాగే కొట్టేసారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే పై ఉన్న పది కేసులు ఒకేసారి కొట్టేయటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పై ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. ప్రజాప్రతినిధుల పై నమోదు అయిన కేసులు కోసం, ఇప్పటికే విజయవాడలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉంది. ఆ కోర్టులో, ఎమ్మెల్యే ఉదయభాను పై ఉన్న ఈ పదకొండు కేసులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి.

udaybhanu 04062021 2

అయితే ఈ కేసులు అన్నీ ఒకేసారి ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. మార్చ్ 23న రాష్ట్ర డీజీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఆధారంగా తీసుకుని, హోం శాఖ, ఈ కేసులు అన్నీ ఎత్తివేస్తూ కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులకు తగ్గట్టుగా ఆయా కోర్టుల్లో ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో, కేసు ఉపసంహరించుకున్నట్టు పిటీషన్ వేయాలని డీజీపీని ఆదేశించింది. సామినేని ఉదయభాను పై, జగ్గయ్యపేట స్టేషన్‌ తో పాటుగా, వత్సవాయి పోలీస్ స్టేషన్, నందిగామ పోలీస్ స్టేషన్, చిల్లకల్లు స్టేషన్లలో కూడా వివిధ కేసులు ఉన్నాయి. ఇందులో సీఎస్‌పీఏ ఆర్గనైజేషన్‌ సర్వే చేస్తున్న సిబ్బందిని అపహరించి, బెదిరించారనే తీవ్రమైన కేసు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసులు అన్నీ ఒకేసారు ప్రభుత్వం ఎత్తేసింది. ఈ పరిణామం పై ప్రతిపక్షం టిడిపి ఫైర్ అయ్యింది. కోర్టులో తేలాల్సిన విషయాలు, ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుందని ప్రశ్నిస్తుంది. అవకాసం ఉంటే, జగన్ కూడా సిబిఐ కేసులు కొట్టేస్తారేమో అని ప్రశ్నిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read