ఎన్టీఆర్ వైద్య పరిషత్ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల ప్రాంతాలకు కూడా భారీ స్థాయిలో ఉచిత రేడియాలజీ సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రజలు, డాక్టర్ల నిష్పత్తి తక్కువని, ఉన్న డాక్టర్లలో కూడా స్పెషలిస్టులు నగర ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటారని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 8 జిల్లా, 31 ప్రాంతీయ, 132 గ్రామీణ ఆసుపత్రులు, ఎక్స్ రే యూనిట్లు అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అయితే, కార్డియాలజిస్ట్ లు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల ప్రజలు ఎక్కువగా ప్రైవేట్‌ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళుతున్నారని, అందువల్ల వారికి వ్యయం ఎక్కువగా అవుతున్నట్లు తెలిపింది.

ap health 07062018 2

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని తమ ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ కార్యక్రమం కింద ఉచిత రేడియాలజీ సేవలు ప్రారంభించినట్లు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఈ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన కేంద్రం నుంచి రేడియాలజీ కార్యక్రమం నిర్వహిస్తారని, ఇక్కడినుంచి మారుమూల ప్రాంతాలకు ఈ సేవలు అందిస్తారని తెలిపింది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఎక్స్ రే ఫిల్మ్, డయాగ్నైజ్ నివేదికను ఆ కేంద్రానికి పంపుతారని పేర్కొంది. అక్కడ ఉండే నిపుణులైన రేడియాలజిస్ట్ లు ఎక్స్ రేని పరిశీలించి సవివరమైన నివేదిక రూపొందిస్తారని పేర్కొంది. దానిని తిరిగి ఆయా ఆసుపత్రులకు పంపుతారని చెప్పింది.

ap health 07062018 3

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, ప్రాంతీయ, గ్రామీణ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అమలు చేస్తున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమం కింద అన్ని వివరాలు రియల్ టైమ్ విధానంలో సమన్వయం చేస్తుంటారని పేర్కొంది. అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంటాయని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెప్పింది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 10,61,572 ఎక్స్ రేలు తీసినట్లు, పది లక్షల మంది రోగులు ప్రయోజనం పొందినట్లు వివరించింది. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు ఖర్చు తగ్గడమే కాకుండా వారికి సమయం కూడా కలిసి వస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమం కింద మార్చి నెలలో 45,973 మంది ప్రయోజనం పొందినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read