ఇప్పుడు ప్రభుత్వాలు, పారదర్శకత వైపు పరుగులు తీస్తున్నాయి. ప్రతి విషయం ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రతి డిపార్టుమెంటు ఏమి చేస్తుంది,ఎంత ఖర్చు పెడుతుంది అనే వివరాలు, సియం డ్యాష్ బోర్డు లో పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత, ఆ డ్యాష్ బోర్డు కూడా సరిగ్గా పని చెయ్యటం లేదని, ఒకరోజు వస్తే, ఒక రోజు రాదు అంటూ విమర్శలు వచ్చాయి. ఇక మరో పక్క ప్రభుత్వం వరుస పెట్టి ఇస్తున్న రహస్య జీవోల విషయంలో కూడా, ఇలాగే విమర్శలు వస్తున్నాయి. ప్రజల దగ్గర దాయటానికి ఏమి ఉంటుంది ? ప్రతి విషయం ప్రజలకు తెలియాలి కదా ? ఏదన్నా మరీ రహస్యం అయితే, ఒకటో రెండో ఉంటాయి కాని, ఇలా వందల జీవోలు ఎందుకు ఉంటాయి అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇది ఇలా ఉంటే, నిన్న అర్ధరాత్రి, 11:45 గంటల నుంచి 11:55 మధ్య, 10 నిమిషాల్లో 10 రహస్య జీవోలు వచ్చాయి. ఈ జీవోలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు చెందినవి కావటంతో, ఇవి ఎన్నికల విషయంలో ఇచ్చిన జీవో లు అంటూ ప్రచారం జరుగుతుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు, 59.85 శాతం రిజర్వేషన్లతో కాకుండా, కేవలం 50 శాతం వరకే ఉండాలి అని కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే.

secretariat 040320202

అయితే ప్రభుత్వం ఈ విషయంలో సరిగ్గా వాదనలు వినిపించలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే వ్యవహరం కూడా నడించింది. హైకోర్ట్ 59.85 శాతం రిజర్వేషన్ రద్దు చేసిన వెంటనే, ప్రభుత్వం ఒకే అంటూ, బీసీల రిజర్వేషన్ తగ్గించి 50 శాతంతో ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అయ్యింది. అయితే, 59 శాతం పై చిత్తసుద్ధి ఉంటే, ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్ళాలి కాని, ఇలా 50 శాతానికి ఎందుకు ఒప్పుకుంది ? బీసీలకు న్యాయం చేస్తాం అంటూ 59 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, దాని కోసం పోరాడాలి కదా ? ఎందుకు సరిగ్గా వాదనలు వినిపించలేదు అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. 24 ఏళ్ళుగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఉందని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్వాకంతో, అది 25కి పడిపోయింది ఆనే వాదన వినిపిస్తుంది.

secretariat 04032020 3

ఇదే సమయంలో, ప్రభుత్వం రహస్య జీవోలు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ, కొత్త రిజర్వేషన్లు ఖరారు చేస్తూ, ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని, ప్రజా వ్యతిరేకత, న్యాయ పరమైన చిక్కులు వస్తాయనే, అవి రహస్యంగా ఉంచారని, వాదనలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషం వరకు ఇవి చెప్పకుండా, ఎవరూ కోర్ట్ కు వెళ్ళకుండా, వీటిని రహస్య జీవోలో ఉంచి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత, ఎలాగూ చెప్పాలి కాబట్టి, అప్పుడు బయటకు చెప్పే అవకాసం ఉన్నట్టు సమాచారం. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత, కోర్ట్ కు వెళ్ళినా, కోర్ట్ ఎన్నికలు ఆపమని ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి, రహస్య జీవోల ద్వారా, 24 ఏళ్ళుగా బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ ను ఎత్తేసే కుట్ర జగన్ చేస్తున్నారని, టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read