నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ సినిమా పాటలు వేసిన వారిని తొలగించాలని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆదేశించడం విదితమే. దీనిపై బాలయ్య ఘాటుగా స్పందించారు. రాజకీయాలకు, సినిమాలకు ముడిపెట్టొద్దని, రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని బాలయ్య పేర్కొన్నారు. తన పాటలు వేయొద్దని వార్నింగ్ ఇచ్చిన గోపిరెడ్డి పేరు పెట్టకుండానే, మరోసారి ఇటువంటి ఘటన జరిగితే చూస్తూ ఊరుకోనని నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. డాక్టర్ అయి వుండి కూడా అరాచకాలు, ఫ్యాక్షన్ చర్యలలో నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అందరికంటే రెండాకుల ఎక్కువేనని ప్రచారం సాగుతోంది. ఇటీవల టిడిపి నేతల వరస హత్యలు అన్నీ ఎమ్మెల్యే చేయించినవేనని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాలకృష్ణ. పొలిటీషియన్ పొలిటీషియన్‌గానే ఉండాలని.. నీచానికి దిగజారకంటూ శ్రీనివాస్‌రెడ్డిని హెచ్చరించారు. బాలకృష్ణ పాట పెట్టిన వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని వేధించినట్లు ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ స్పందించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని.. అన్ని పార్టీల వాళ్లు తన సినిమాలు చూస్తారన్నారు బాలకృష్ణ. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటూ హెచ్చరించారు. తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంలో బాలయ్య గోపిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.
తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్
Advertisements