నంద్యాల ఉప ఎన్నిక వైఎస్ఆర్ పార్టీ అభ్యర్ధి, శిల్పా మొహర్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నంద్యాల వాసులు తప్పితే, వేరే వారు నంద్యాల నియోజకవర్గ పరిధాలో ఎవరూ ఉండకూడదు అనే నిబంధన ఉంది.
అయితే వైఎస్ఆర్ పార్టీ ఈ నిబంధన తుంగలోకి తొక్కింది. శిల్పా మొహర్ రెడ్డి తమ్ముడు శిల్పా చక్రపాణి నంద్యాల వాసి కాకపోయినా, నంద్యలో లోని శిల్పా ఇంట్లోనే ఉంటూ, హడావిడి చెయ్యటంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి, విషయం చెప్పారు. కాని శిల్పా కుటుంబం ఒప్పుకోవట్లేదు.
అదే సమయంలో శిల్పా ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కూడా పోగయ్యారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నిబంధనలు ప్రకారం నడుచుకుంటున్న పోలీసులకి సహకరించకుండా, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అని శిల్పా వర్గం చెప్పటంతో, పోలీసులు ఏ రకమైన వైఖరి తీసుకుంటారో చూడాలి. మొత్తానికి, ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.