కడప జిల్లా, పులివెందుల అంటేనే ముందుగా గుర్తుకువచ్చేది వైఎస్ కుటుంబం... అయితే, వైఎస్ఆర్ చనిపోయిన దగ్గర నుంచి, జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోకి వచ్చిన పులివెందులలో, వైఎస్ కుటుంబానికి వ్యతిరేకత మొదలైంది... సొంత బాబాయిని, సొంత ఊరిలో కూడా గెలిపించుకోలేని పరిస్థితికి, తీసుకొచ్చాడు జగన్... ప్రజల్లో కూడా జగన్ తమ నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అనే భావనలో ఉన్నారు... జగన్ చేస్తున్న పనుల వల్ల, కంచుకోటకు బీటలు పడ్డాయి.. సరిగ్గా ఇదే టైంలో చంద్రబాబు రంగంలోకి దిగారు... పులివెందుల ప్రజలకు ఇప్పటి వరకు తెలియాని అభివృద్ధి, నీళ్ళు చూపిస్తూ, పోజిటివ్ వాతవరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు...

pulivendula 04032018 2

జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల సహా జిల్లాలో ఇప్పటికే చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం చంద్రబాబు కడప తమ్ముళ్లకు చెప్పారు. ఇంకా మిగిలిఉన్న ప్రజాసమస్యలను గుర్తించి తమ దృష్టికి తేవాలని సూచించారు. నిధులు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా వాటిని పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. జగన్ ను, తన అభివృద్ధి మంత్రంతోనే పడగొట్టాలనేది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు... ఇదే సందర్భంలో, కొన్ని రోజుల క్రిందట అభివృద్ధిపై అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైసీపీలు ఇటీవల సవాళ్లు, ప్రతిసవాళ్ళు విసురుకున్నాయి.

pulivendula 04032018 3

అనంతరం ఆదివారం పూలంగళ్ళ సర్కిల్‌లో బహిరంగ చర్చకు రావాలంటూ ఇరుపార్టీల నేతలు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో నేడు పూలంగళ్ళ సర్కిల్‌లో జరిగే చర్చకు ఇరుపార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది.సమాచారమందుకున్న పోలీసులు పెద్దఎత్తున పూలంగళ్ళ సర్కిల్‌కు చేరుకుంటున్నారు. ఇరుపార్టీల నేతలను అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. టీడీపీ, వైసీపీ నేతలు ఎదురుపడితే ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉండడంతో పోలీస్ బలగాలు పెద్దఎత్తున మోహరిస్తున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అనే టెన్షన్ లో ఉన్నారు పోలీసులు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read