నిన్న రాత్రి వెలగపూడిలో జరిగిన ఘ-ర్ష-ణ తీవ్ర రూపం దాల్చింది. నిన్న రాత్రి వెలగపూడిలో ఒకే సామజికవర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘ-ర్ష-ణ, ఒకరి మృతికి దారి తీసింది. ఈ రోజు హోంమంత్రి సుచరిత, సంఘటనా స్థలానికి చేరుకొని, బాధిత కుటుంబాన్ని పరామర్శించే సందర్భంలో తీవ్ర ఉ-ద్రి-క్త పరిస్థితి నెలకొంది. అలాగే వివాదానికి కారణమైన రోడ్డును కూడా హోంమంత్రి పరిశీలించారు. పరిశీలించిన అనంతరం మృతి చెందిన మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించే క్రమంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. హోంమంత్రితో పాటుగా, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, బాపట్ల ఎంపీ సురేష్, ఆమె వెంట రావటం పై, అక్కడ ప్రజలు తప్పుబట్టారు. హోంమంత్రి వస్తే తమకు అభ్యంతరం లేదని, ఈ పరిస్థితికి దారి తీసిన నందిగం సురేష్ వస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకొము అంటూ , ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మరోవైపు అదే సమయంలో, తాడికొండ ఎమ్మల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా సంఘటనా స్థలానికి రావటంతో, ఆమె రాకను కూడా వ్యతిరేకిస్తూ నినాదాలు చేసారు. తాము పార్టీని చూసి జగన్ కు ఓటు వేస్తె, మీరు కులాలు చూస్తున్నారు అంటూ, వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, తిరుగుబాటు ప్రయత్నం చేసారు. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితి చక్కదిద్దారు.

home 28122020 2

మరియమ్మ కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించి, చర్చలు జరపటం, కొన్ని హామీలు ఇవ్వటంతో, వాళ్ళు తాత్కాలికంగా తమ నిరసనను విరమించారు. అయితే తక్షణ సాయంగా, బాధిత కుటుంబానికి 10 లక్షలు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా పోలీసులు, స్థానిక సిఐ మీద కూడా బాధితులు హోంమంత్రికి ఫిర్యాదు చేయటంతో, ఈ నేపధ్యంలో స్థానిక పోలీసులు ప్రమేయం పై కూడా విచారణ చేసి, వాళ్ళు బాధిత్యారాహిత్యంగా ఉన్నారని తేలితే మాత్రం, వారి పై కూడా చర్యలు తీసుకుంటామని కూడా బాధితులకు హామీ ఇచ్చారు. అయితే ఇరు వర్గాలు కూడా కలిసిపోయి ఉండాలని హోంమంత్రి మాట్లాడుతున్న సమయంలో, అది జరగని పని అంటూ బాధిత వర్గాలు నినాదాలు చేసారు. బాధితులు ఉద్రిక్తంగా ఉన్న నేపధ్యంలో, ముందుగా చేస్తున్న నిరసన ఆపి, తరువాత ఇరువురిని కూర్చోబెట్టి, సమస్యను పరిష్కరించే విధంగా చేయాలని కూడా హోంమంత్రి నిర్ణయం తీసుకుని, అక్కడ నుంచి వెనుదిరిగారు. అయితే ఎంపీ సురేష్ తన పేరుని తీసుకుని ఎవరో చేస్తే, తాను బాధ్యత వహించలేనని, తనకి అందరూ ఒకటే అని చెప్పారు. ప్రస్తుతం నిరసన విరమించినా, పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read