వైసీపీ శ్రేణుల్లో జూన్ 1 టెన్షన్ నెలకొంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ రేపు విచారణకు వస్తుంది. అయితే ఈ కేసు గత నెల రోజులుగా విచారణకు రాకుండా సాగుతుంది. గత మూడు వాయిదాల్లో, సిబిఐ కానీ, జగన్ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో చివరి వాయిదాలో సిబిఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే, ఇక విచారణకు వెళ్తాం అంటూ, సిబిఐ కోర్ట్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే రేపు చివరి అవకాసం కావటంతో, అందరూ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి విషయంలో అయితే ఆయన కౌంటర్ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. ఆయన బెయిల్ రద్దు చేయవద్దు, నేను బెయిల్ కండీషన్స్ ఏమి ఉల్లంఘించలేదు అనే చెప్తారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి సిబిఐ మీద ఉంది. సహజంగా సిబిఐ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ, ఇలాంటి రాజకీయ పరమైన కేసులో, కచ్చితంగా కేంద్ర హోం శాఖ అభిప్రాయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ విషయంలో సిబిఐ వైఖరి ఎలా ఉంటుందో తెల్సితే, జగన్ విషయంలో కేంద్రం వైఖరి కూడా అర్ధమైపోతుంది. జగన్ కు, కేంద్ర పెద్దలకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే విషయం, రేపు సిబిఐ వేసే కౌంటర్ తో స్పష్టం అవనుంది.

bail 31052021 2

ఒక దర్యాప్తు సంస్థగా, బెయిల్ రద్దు చేయవద్దు అని సిబిఐ అడిగే అవకాసం సహజంగా ఉండదు. తాము నిందితుడు అని చెప్పిన వ్యక్తి పట్ల, సిబిఐ సానుకూలత చూపించకూడదు. రెండో అంశం బెయిల్ రద్దు చేయండి అని కోరితే, అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇక ఏ కోర్ట్ కూడా, జగన్ బెయిల్ రద్దుని ఆపే అవకాశమే ఉంటుంది. ఇక మూడో అంశం, సిబిఐ ఏమి చెప్పకుండా, కౌంటర్ ఇవ్వకుండా ఉండటం. ఎందుకుంటే ఇప్పటికే కోర్టు ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ, మీరు కౌంటర్ వేయకపొతే, మేము విచారణ ప్రారంభిస్తాం అని చెప్పిన విషయం తెలిసిందే. తటస్థంగా ఉండి, సిబిఐ కోర్టుకు ఆ నిర్ణయం వదిలేస్తే, రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి రేపు సిబిఐ ఏమని కౌంటర్ వేస్తుంది అనేది వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ గా ఉందనే చెప్పాలి. ఈ దెబ్బతో కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం అవుతుంది. ఇప్పటికే ఏపి బీజేపీ నేతలు, పలు సందర్భాల్లో జగన్ బెయిల్ రద్దు అవుతుంది, ఆయన జైలుకు వెళ్తారు అంటూ బహిరంగంగానే చెప్తున్న విషయం తెలిసిందే. దీంతో రేపటి పరిణామాల పై వైసిపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read