అది ఓ ఆధ్యాత్మిక ఆశ్రమం.. కానీ ప్రజలు ఎవరికీ ఎంట్రీ లేదు... అసలు అక్కడ ఓ ఆశ్రమం ఉన్నట్టే ఎవరికీ తెలియదు. కానీ ఆ ఆశ్రమం గురించి ఉత్తరాది నాయకులు అందరికీ బాగా తెలుసు అందుకే కేవలం వీవీఐపీలు మాత్రమే అక్కడకు వస్తూ ఉంటారు... ఉత్తరాదికి చెందిన రాజకీయ ప్రముఖులు కూడా వస్తుంటారు... అయితే ఇక్కడకి ఎవరు వచ్చినా అంతా సీక్రెట్ గానే వస్తుంటారు తప్ప ఎక్కడా ఫోకస్ అవ్వడానికి మాత్రం ఇష్టపడరు. మొన్న అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు కూడా, ఇక్కడ 40 నిమషాలు సీక్రెట్ గా ఉన్నారు. ఇప్పుడు దీని గురించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ సిద్దేశ్వర్ తీర్థ్ బ్రహ్మర్షి ఆశ్రమంలో స్వామి గురువానంద కొంత మందిని మాత్రమే కలుస్తారు, అదికూడా రహస్యంగా. కొన్ని నెలల క్రితం ఒకానొక అధికారి వచ్చారు! ఆ ఆశ్రమంలో స్వామీజీని సందర్శించుకున్నారు! వెళ్లారు! ఆ తర్వాత ఇరవై రోజుల్లోపలే దేశంలోని ఒక ప్రముఖ ఆర్థిక లావాదేవీల సంస్థకు ఆయన సారథి అయ్యారు.

అమిత్‌షా కంటే ముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితర ప్రముఖులు ఈ ఆశ్రమానికి వచ్చి వెళ్లారు. ఇక్కడకు వచ్చే చాలామంది ప్రముఖులు రెండో కంటికి తెలియకుండా, రాత్రి సమయాల్లో నే వచ్చిపోతుండటం విశేషం! దీంతో ఈ ఆశ్రమం చుట్టూ అనేక ఊహాగానాలు అలుముకుంటున్నాయి. పెద్దగా ప్రచారంలో లేని, మారుమూలన ఉండే ఆశ్రమాలను భద్రమైనవిగా భావించి.. వాటిని వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ‘అవసరాలకు’ ఉపయోగించుకుంటున్నారా.. అ నే ఊహ అందులో ఒకటి! తిరుపతి సమీపంలోని గుట్టల్లోని ఆశ్రమానికి అత్యంత ప్రముఖుల రాకపోకలు రహస్యంగా జరుగుతుండటం మాత్రం నిజం.. అయితే ఈ వార్తా బయటకు రాగానే, స్థానికులు భగ్గు మన్నారు. రామాపురం సిద్ధేశ్వరతీర్థ బ్రహ్మర్షి ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాల పై ఎదురు తిరిగారు. నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి, ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. ఆశ్రమంలోని కృష్ణ మందిరం, గోశాలను కమిటీ సభ్యులు పరిశీలించారు.

కాగా గురుదేవ్ ఏకాంత మందిరాన్ని కూడా పరిశీలించాలని లోనికి వెళ్తున్న కమిటీ సబ్యులను ఆవ్రమం సిబ్బంది అడ్డుకున్నారు. స్వామీజీ గురువానంద్ ఆశ్రమంలో లేరని ఆపడంతో కమిటీ సభ్యులు కాసేపు ధర్నా చేశారు. నిజనిర్ధారణ కమిటీ ఆందోళనకు దిగితే అంతలో వైసీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. గురుదేవ్ లేని సమయంలో రాద్ధాంతం ఏంటంటూ విరుచుకుపడ్డారు. దీంతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ధీటుగా బదులిచ్చారు. ఇక్కడ రాజకీయాలు చేయవద్దన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకే తాము వచ్చామన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆశ్రమంలో తనిఖీలకు వెళ్లిన సందర్భంలో సి.రామాపురం గ్రామస్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్వామీజీ తమ భూములను ఆక్రమించుకున్నారని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read