దుర్గమ్మవారి తెప్పోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.... శనివారం సాయంత్రం 5.30గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుంది... అంతకు ముందు ఉత్సవమూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా కృష్ణానది వద్దకు తీసుకువస్తారు... తెప్పోత్సవం 90 నిముషాల పాటు సాగుతుంది.

ఈసారి అమ్మవారి ఉత్సవమూర్తులు, వేదపండితులు, అర్చకులు, భజంత్రీలు తదితరులు సుమారు 25 మంది వరకు ప్రధాన హంసవాహన పంటుపై ఉంటారు... వీవీఐపీలు, వీఐపీల కోసం ఒక బోటును, పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ మీడియా కోసం మరో బోటును ఏర్పాటు చేస్తున్నారు...

ఈసారి స్పెషాలిటీ, హంస వాహనం ప్రదక్షణ చేసే నది మధ్య భాగంలో ఒక ఫంట్‌పై లేజర్‌షోను ఏర్పాటు చేస్తున్నారు. లేజర్‌ షో ఉన్న ఫంట్‌ చుట్టూ ప్రదక్షణగా హంసవాహనం తిరుగుతుంది. దీంతోపాటు బాణసంచాను కూడా కాల్చుతారు. లేజర్‌ షో, బాణసంచా కాంతులు చూపరులకు కనువిందు చేయనున్నాయి. పండితుల వ్యాఖ్యానంతో పాటు, హంసవాహనంపై ఉన్న వేదపండితులు వేదం చదువుతుంటారు.

తెప్పోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దుర్గాఘాట్‌లోకి పాస్‌లున్నవారినే అనుమతిస్తారు. ఇతరులు బ్యారేజిపై నుంచి తిలకించాల్సి ఉంటుంది.

తెప్పోత్సవంగా పిలిచే ఈ హంస వాహన సేవ అమ్మకు ప్రీతిపాత్రం... అసలు ఈ ఉత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు? హంస వాహనం వెనుక కథ గురించి తెలుసుకుందాం...

దుర్గమ్మ త్రిశక్తి స్వరూపిణి... మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. ఈ ముగ్గురమ్మలలో సరస్వతీ దేవికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. దుర్గమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అలంకరిస్తారు. అందుకే సరస్వతీ దేవి వాహనంగా హంసను వినియోగిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read