ఫైబర్ టెక్స్టైల్స్, కార్బన్ ఫైబర్, లైఫ్ సెన్స్, రసాయన, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపాన్ కు చెందిన టోరే సంస్థ ఏర్పాటుకు శ్రీసిటీలో బుధవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అమరనాథ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శ్రీసిటీలో 110 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ పరిశ్రమలో రెండు ఉత్పత్తి కేంద్రాలను నిర్మించనున్నారు. ఒకదానిలో వ్యక్తిగత పరిశుభ్రతకు వాడే డైపర్ల తయారీకి అవసరమైన పాలిప్ రొపిలిన్ ఫైబర్ వస్త్రం (టెక్నికల్ టెక్స్టైల్), రెండవ దానిలో ఆటోమొబైల్ రంగంలో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలకు అవసరమైన ప్లాస్టిక్ రెజిన్ తయారు చేయనున్నారు.

tero 11072018 2 1

ఈ రెండు ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం 2020 నాటికి పూర్తి కానుంది. కాగా, టోరే సంస్థకు ఇప్పటికే భారతదేశంలో పలుచోట్ల వ్యాపార కేంద్రాలున్నాయి. 2016లో గుజరాత్ లోని వాపిలో మోటార్ వాహనాల్లో వాడే ఎయిర్ బ్యాగుల ఉత్పత్తి సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కూడ తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించి సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భూమి పూజకు టోరే ఇండస్ట్రీస్ సీఈవో అకిహిరో నిక్కాకి, టోరే ఇండస్ట్రీస్ ఇండియా ఎం.డీ. షిగెకజు సునేగ జపాన్ వాణిజ్య రాయబారి యుచియామ, శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎం.డీ. రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు.

tero 11072018 3 1

ప్రపంచంలోని వెయ్యి భారీ పరిశ్రమల్లో ఒకటిగా టోరేకు గుర్తింపు ఉంది. ఈ సంస్థను 1926లో ప్రారంభించారు. ఆ సంస్థ మన దేశంలో ఒక మెగా టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుండటం మాత్రం ఇదే మొదటిసారి. ఇప్పటికే ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌, కింబర్లీ క్లార్క్‌, యూనీచార్మ్‌ వంటి సంస్థలు డైపర్ల తయారీలో ఉన్నాయి. వీటికి టోరే ఉత్పత్తులు గట్టి పోటీ ఇస్తాయని మార్కెట్‌ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంస్థ ప్రతినిధులు, గత సంవత్సరం ఆగష్టు లో చంద్రబాబుని కలిసారు. అప్పట్లో, ఈ సంస్థ భారీ పెట్టుబడి పెడుతుంది అని వార్తలు రాస్తే, కొంత మంది ఎగతాళి చేసారు. సంవత్సరం తిరగకుండా, ఈ రోజు శంకుస్థాపన చేసారు. అందుకే ఏపి కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read