జూన్ 28వ తేదీన, తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 34ను రద్దు చేయాలి అంటూ, కృష్ణా జిల్లాకు చెందిన కొంత మంది రైతులు, తెలంగాణా హైకోర్టులో వేసిన పిటీషన్ పై ఈ రోజు విచారణ జరిగంది. నిన్న కూడా దీని పైన వాదనలు జరిగాయి. అయితే నిన్నే, దీని పై తెలంగాణా ఏజీ వాదిస్తూ, అసలు జల వివాదాలు కోర్టుల పరిధిలోకి రావు అని వాదించారు. దీని పై నిన్న కోర్టుకు, ఏజీ మధ్య కొంత వాదనలు జరిగాయి. ట్రిబ్యునల్ కు మాత్రమే దీని పై అధికారాలు ఉన్నాయని అన్నారు. గతంలో 2008లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఏమి చెప్తున్నాయో చూడాలి అంటూ, నిన్న కొంత వాదన జరిగిన తరువాత, ఈ రోజుకి కేసు వాయిదా పడింది. అయితే ఈ రోజు తెలంగాణా ఏజీ వాదన పూర్తిగా మారిపోయింది. దీంతో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోట చేసుకున్నాయి. అసలు ఈ పిటీషన్ విచారణ చెయ్యల్సింది ఎవరు అనే దాని పైన, ఈ రోజు ప్రధానంగా వాదనలు జరిగాయి. జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనానికి సంబంధించిన బెంచ్ ముందుకు ఈ పిటీషన్ విచారణకు రావటంతో, తెలంగాణా ఏజీ అభ్యంతరం చెప్పారు. ఈ పిటీషన్ రోస్టర్ ప్రకారం, చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు వెళ్తుందని, వారు మాత్రమే విచారణ చేయాలని, మీరు ఎలా విచారణ చేస్తారు అంటూ అభ్యంతరం తెలిపారు.

tg 06072021 2

చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ కేసు విచారణ చేయాలి అంటూ, పట్టుబట్టారు. అంతే కాకుండా, ఈ విషయం చీఫ్ జస్టిస్ కు కూడా చెప్పారు. అయితే ఇదే విషయం పిటీషన్ ను విచారణకు తీసుకున్న, జస్టిస్ రామచంద్రరావు బెంచ్ ముందే చెప్పాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు. దీంతో ఇదే విషయం, జస్టిస్ రామచంద్రరావు బెంచ్ ముందు, తెలంగాణా ఏజీ ప్రస్తావించారు. రోస్టర్ పై ఉన్న అభ్యంతరాలు మీకు చెప్పాలని చీఫ్ జస్టిస్ చెప్పారు అంటూ తెలంగాణా ఏజీ చెప్పారు. అయితే దీని పై పిటీషనర్లు స్పందిస్తూ, న్యాయమూర్తి ఏపి వ్యక్తి కాబట్టే అభ్యంతరం చెప్తున్నారని వాదించారు. అయితే జస్టిస్ రామచంద్రరావు బెంచ్ మాత్రం, నిన్న విచారణ చేపట్టిన తరువాత, ఇప్పుడు అభ్యంతరం చెప్పటం ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఏజీ తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అయితే దీని పై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ, న్యాయమూర్తి పై అభ్యంతరాలు ఉంటే, మధ్యంతర పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కోరటంతో, తెలంగాణా ఏజీ అంగీకరించారు. పలానా బెంచ్ కావాలని కోరటం ఏమిటి అని, అసలు నిన్న ఎందుకు అభ్యంతరం తెలపలేదని, ఈ పిటీషన్ ఏ బెంచ్ ముందుకు వెళ్ళాలో త్వరలోనే తాము నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read