ప్రజలు, ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగమనే వాటికి తావులేకుండా, జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, వారు సంతోషంగా ఉండేలా సాగాల్సిన రాష్ట్రపాలన, ఈ ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా సాగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు జవాబుదారీగా బాధ్యతలు నిర్వహించాల్సిన ప్రభుత్వం, అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, గాంధారి పుత్రుల్లాంటి 151 ఎమ్మెల్యేలున్నారు కదా అని దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన పనిలేదని, జీవోలకు నంబర్లు ఇవ్వాల్సిన పనిలేదని ప్రభుత్వమే చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేసేపనులు ప్రజలకు తెలియచేయాల్సి నబాధ్యత పాలకులపైనే ఉందని, అందుకోసమే ఆర్టీఐ చట్టాన్ని (సమాచారహక్కు చట్టం) తీసుకురావడం జరిగిందన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, విధులకు విఘాతం కలిగేలా, జీవోలను ఆఫ్ లైన్లో పెడతామనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇష్టాను సారం జీవోలు విడుదలచేస్తాం... అవి ప్రజలకు తెలియాల్సిన పనిలేదని చెప్పడం ముమ్మాటికీ రాజ్యాంగవిరుద్ధమే అవుతుందని మాజీ మంత్రి తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారుగా వ్యవహరించా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అప్పులు చేయడానికి, దోచుకోవడానికే ప్రభుత్వం బ్లాంక్ జీవోలు, రహస్య జీవోలిస్తుందా అని ఆలపాటి నిలదీశారు.
తెలంగాణ హైకోర్టు నిన్న చాలా స్పష్టంగా జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించిందన్నారు. ఏపి నిర్ణయం పై కూడా, భంగపాటు తప్పదన్నారు. ఆర్థిక శాఖలోని సమాచారం బయటకు వచ్చిందన్న కారణంతోనే ప్రభుత్వం జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమం పేరుతో అప్పులుచేస్తూ, తద్వారా వచ్చే సొమ్ముని దొడ్డిదారిన తన ఖజానాకు మళ్లిస్తున్నాడన్నా రు. కేంద్ర ప్రభుత్వ అనుమతి, ఎఫ్ఆర్ బీఎం పరిమితులకు లోబడే ప్రభుత్వం అప్పులు చేయాలని, కానీ జగన్ తనకు తోచిన విధంగా అప్పులు చేస్తూ, ఆసొమ్ముని కాజేయడానికే జీవోలను కూడా బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న అక్రమ, తప్పుడు నిర్ణయాలు ప్రజలకు తెలియకూడదనే ప్రభుత్వం చీకటి జీవోలను దాచేస్తోందన్నారు. ఈ విధంగా చేస్తున్న ముఖ్యమంత్రి ముమ్మాటికీ పరిపాలనకు అనర్హుడని మాజీమంత్రి తేల్చి చెప్పారు. ప్రజలకు సమాచారం తెలియ చేయకుండా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 13ను కూడా ఉల్లంఘిస్తున్నా డన్నారు. సమాచారహక్కు చట్టాన్ని కూడా తుంగలో తొక్కతూ, ప్రభుత్వం తీసుకున్న జీవోల ఆఫ్ లైన్ నిర్ణయం, ముమ్మాటీకి రాజ్యాంగ వ్యతిరేకమేనన్నారు. ఈ విధమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంపై న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే చర్యలు తీసుకుంటామని ఆలపాటి స్పష్టంచేశారు.