ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ఆపాలి... ఇన్ని అడ్డంకులు సృష్టించినా, డబ్బులు ఇవ్వకపోయినా చంద్రబాబు ఇంత ఫాస్ట్ గా పోలవరం ప్రాజెక్ట్ కడుతుంటే, ఇక మనకు దశాబ్దాల పాటు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో, అందరూ ఏకం అవుతున్నారు.. నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...
ఇప్పుడు తాజగా చుస్తే, నవయుగ వచ్చిన తరువాత పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి.... ఇప్పటికే 55శాతం పనులు పూర్తయ్యాయి... స్పీడ్ చూస్తుంటే, 2019కి గ్రావిటీ ద్వరా నీళ్ళు ఇచ్చే అవకాశం మెండుగా ఉంది... దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలా అయినా పోలవరం ప్రాజెక్ట్ ఆపాలనే పట్టుదలతో ఉంది... దీన్నే ఆపరేషన్ గరుడలో ఒక భాగంగా తీసుకున్నారు.. పోలవరం ఆపేసి, రాష్ట్రంలో ఒక అనిశ్చితి, చంద్రబాబు పట్ల అప నమ్మకం తీసుకు రావాలనే ప్లాన్ వేసారు... అందులో భాగంగా, పోలవరం అవినీతి అనే విషయం పైకి తేవాలని, అన్ని రికార్డులు తిరగేసారు... అన్ని లెక్కలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి... అవినీతి అని చెప్పి, పోలవరం ఆపే పరిస్థితి లేదని తెలుసుకున్నారు.. అందుకే, ఇప్పుడు అనేక మార్గాలు వెతుకుతున్నారు..
తెలంగాణా, ఒరిస్సా ద్వారా ఇప్పుడు పోలవరం ఆపే ప్రయత్నం చేస్తున్నారు.. ఇందులో భాగంగా, నిన్న తెలంగాణా, ఒరిస్సా అధికారులు కలిసి మాట్లాడుకున్నారు. ఒడిశా, తెలంగాణలు దీనిపై సంయుక్త కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోపాటు, నిలిపి వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి పలు దఫాలు లేఖలు రాశారు. ఏపీకి బదిలీ చేసిన ముంపు మండలాల్లోనే కాకుండా మరింత ఎక్కువగా ముంపు ఉంటుందని, దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణ కూడా ఇంప్లీడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒడిశా నీటిపారుదల శాఖ కార్యదర్శి పి.కె.జైనా, ఆ రాష్ట్ర ఇంజినీర్ ఇన్ చీఫ్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తోన్న ఎస్.కె.జోషి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం హైదరాబాద్లో సమావేశమై చర్చించారు. పోలవరం వల్ల తమ రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలను ఒడిశా అధికారులు వివరించారు. అయితే ఒడిశా సమస్య వేరు, తెలంగాణ సమస్య వేరనీ, కలిసి పోరాడటమని కాకుండా, రెండు రాష్ట్రాలు ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలో చూద్దామని తెలంగాణ అధికారులు సూచించినట్లు తెలిసింది. దీనిపై మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం.