ఆంధ్రప్రదేశ్ లో జల విద్యుత్ కేంద్రాల వద్ద, ఏపికి చెప్పకుండా తెలంగాణా వంద శాతం పవర్ జనరేషన్ జరుగుతూ ఉండటం పై మళ్ళీ వివాదం నెలకొంది. నాగార్జన సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వంద శాతం పవర్ జనరేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పులిచింతల ప్రాజెక్ట్ వద్ద జల విద్యుత్ ఉత్పాదన కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. ఆంధ్రప్రదేశ్ లో పులిచింతల ఏపి భూభాగంలో ఉండగా, హైడల్ పవర్ ప్రాజెక్ట్ మాత్రం తెలంగాణా భూభాగంలో ఉంది. తెలంగాణాలోని సూర్యాపేట జిల్లా చింతల పాలెం వద్ద ఈ ప్రాజెక్ట్ పవర్ జనరేషన్ అవుతూ ఉంటుంది. గత రాత్రి నుంచి కూడా తెలంగాణా ప్రభుత్వం పవర్ జనరేషన్ ప్రారంభించింది. 1500 క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకుని ఒక యూనిట్ లో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, విద్యుత్ ఉత్పాదన మొదలు పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో కూడా సుతిమెత్తగానే వెళ్తుంది. తెలంగాణా దూకుడుగా వెళ్తుంటే, ఏపి మాత్రం కేవలం కేంద్రానికి లేఖలో ఫిర్యాదు చేసి ఊరుకుంది. గత వారం అక్రమ ప్రాజెక్ట్ లు విషయంలో కూడా అన్ని తిట్టులు తిట్టినా, కేవలం లేఖలు రాసి ఊరుకున్నట్టే, ఇక్కడ కూడా ఏపి ప్రభుత్వం అదే పని చేసింది.

power 30062021 2

తెలంగాణా అధికారులు విద్యుత్తు ఉత్పాదన చేస్తూ ఉంటే, నీరు అంతా బయటకు వెళ్లి పోతుయి, దీని వల్ల కృష్ణా డెల్టాలో సాగు తాగు నీరు అవసరాల కోసం, కృష్ణా డెల్టాలో నారు మళ్ళుకి, కృష్ణా, గుంటూరులో తాగు నీటికి ఇబ్బంది అయ్యే అవకాసం ఉంది. పులిచింతల ఉన్న నీటిని తెలంగాణా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటే, ఏపి ఇంకా దూకుడుగా వెళ్లకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ఉదయం వరకు కూడా దాదాపుగా రెండు వేల క్యూసేక్కుల నీటిని వాడుకున్నారు. ఇప్పుడు కూడా పవర్ జనరేషన్ జరుగుతూ ఉంది, దీంతో పులిచింతల ప్రాజెక్ట్ లో ఉన్న నీరు తగ్గిపోతుంది. మరో పక్క శ్రీశైలం, నాగార్జున సాగర్ లో కూడా వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు మొత్తం కృష్ణా నీళ్ళు తెలంగాణా వాడేసుకుంటుంది. అటు రాయలసీమకు , ఇటు కృష్ణా డెల్టాకు కూడా ఇబ్బంది అయ్యే అవకాసం ఉంది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read