ఈ రోజే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆర్పీ ఠాకూర్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కార్యాలయానికి వెళ్లారు. గౌతమ్ సవాంగ్ తో అరగంటకు పైగా భేటీ అయ్యారు. నగరంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. కొద్దిసేపు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులు కావటంతో ఇద్దరి మధ్య డీజీపీ పోస్ట్‌కు పోటీ పెరిగింది. ప్రభుత్వం ఠాకూర్‌ను నియమించటంతో గౌతమ్ సవాంగ్ మనస్థాపానికి గురయ్యారని పోలీసులు వర్గాలు పేర్కొన్నాయి. సంప్రదాయంగా కొనసాగే మాజీ డీజీపీ మాలకొండయ్య రథ వీడ్కోలు యాత్రకు సీపి రాకపోవటంతో ఆయన్ను పలకరించేందుకు ఠాకూర్ సీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. అనంతరం ఇద్దరూ చిరునవ్వులతో బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ నేపథ్యంలో డీజీపీ, సీపీల భేటీ విశేషంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్.పి ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త డీజీపీ కోసం సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు ఠాకూర్‌ను డీజీపీగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఠాకూర్ వచ్చాక అవినీతి అధికారుల భరతం పట్టారు. దీంతో డీజీపీగా ఠాకూర్ నియమించేంది అనుమానమే అని సావంగ్‌కే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. డీజీపీ ఎంపికపై చంద్రబాబుతో అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత ఎంపికపై చంద్రబాబు అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి చివరకు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు.