2014లో అధికారం చేపట్టగానే చంద్రబాబు చేసిన మొదటి పెద్ద ప్రాజెక్ట్, పట్టిసీమ పూర్తి చెయ్యటం.. అది చేస్తూనే, పురుషోత్తపట్నం మొదలు పెట్టటం... అప్పుడు ఎంత చెప్పినా, కొంత మందికి వీటి విలువ తెలియలేదు... ఇవాళ కృష్ణా, గోదావరి డెల్టా పచ్చగా ఉన్నా, ఇప్పటకీ పట్టిసీమ దండగ అని అంటూనే ఉన్నారు... నిజానికి పోలవరం పూర్తి అయితే, ఇవి అవసరం ఉండదు.... కాని అటు కేంద్రం గురించి చంద్రబాబుకి తెలుసు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పనికిరాని ప్రతిపక్షం గురించి చంద్రబాబుకి తెలుసు... పోలవరం విషయంలో ఇబ్బందులు ఉంటాయి అని ముందు ఊహించే, పట్టిసీమ కాని, పురుషోత్తపట్నం కాని మొదలు పెట్టారు...

polavaram 01122017 2

ఒక్కసారి పట్టిసీమ లేకపోతే, ఈ రెండు సంవత్సరాలు పరిస్థితి ఏంటో ఆలోచించండి... ఎండిన భూములే కాదు, చివరకి తాగటానికి కూడా నీళ్ళు ఉండేవి కాదు... పోలవరం నిర్మాణంలో, రాజకీయంగా కేంద్రం ఇబ్బంది పెడుతుంది అని చంద్రబాబు ముందే ఊహించి, పట్టిసీమ, పురుషోత్తపట్నం పూర్తి చేశారు... ఇవి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కాబట్టి, నిర్వహణ భారం ఎక్కువ ఉంటుంది, అందుకే పోలవరం త్వరగా పూర్తి చెయ్యటానికి చంద్రబాబు తాపత్రయ పడుతుంటే, ఇన్ని అడ్డంకాలు సృష్టిస్తున్నారు... పట్టిసీమ నీటితోనే కృష్ణా డెల్టా రైతులు ఒడ్డున పడ్డారు... గత ఐదు నెలల నుంచి నిరాఘాటంగా గోదావరి జలాలు ఇస్తుండడంతో సాగునీటి కొరత తీరింది. దీంతో తూర్పు కాలువ పరిధిలోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పొలాల్లో అప్పుడే కోతలు మొదలయ్యాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి కోతల వరకు ఎక్కడా నీటికి ఇబ్బంది లేకపోవడంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా లేకపోవడంతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా దిగుబడి ఇళ్లకు చేరుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ మంచి దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం తొణికిసలాడుతోంది...

polavaram 01122017 3

మరి ఇలాంటి, పట్టిసీమ దండగన్న మేధావులు, పోలవరం పై కేంద్ర వైఖరిపై మాట్లాడరే ? కేంద్ర అతి తెలివితేటల వల్ల పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుంది. అదే ఇప్పుడు పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు లేకపోతే పరిస్థితి ఏంటో విజ్ఞునులు కూడ ఆలోచించాలి... ఇవన్నీ ముందే ఊహించిన ముఖ్యమంత్రి, రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం పూర్తి చేశారు... రాజకీయంగా ఆయనికి ఇబ్బంది అయినా, రైతులకి మేలు చేకూర్చాలని, పోలవరం పూర్తి అయ్యే లోపు, ఇవి రైతులని ఆదుకోవాలనే ఉద్దేశంలో ఈ ప్రాజెక్ట్ లు పూర్తి చేశారు... ఆయనకు అడ్డంకులు లేకుండా సహకరించండి... కొండను కూడా పిండి చేసే సంకల్పం ఆయనకు ఉంది.... లేదు అంటే, మీ ఖర్మ... ఆంధ్రోడి దెబ్బ ఏంటో, మీ పక్కనే ఉన్న సోనియా గాంధీని అడగండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read