బీజేపీ నేతలు, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాడునాయుడు అన్నారు. పోలవరం పనులు నాలుగేళ్ళలో 56 శాతం పూర్తి చేశామని, పది వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, చేసిన పనులకు జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింద న్నారు. జలవనరులు, గ్రామీణాభివృద్ది, ఐటి, స్వచ్చ సర్వేక్షణ్‌లో 60 అవార్డులు రావడమే అందుకు నిదర్శనమ న్నారు. పోలవరానికి కేంద్రం ఇంకా 1,950 కోట్లు ఇవ్వాలని, కానీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఇందుకు విరుద్దంగా మాట్లాడారని విమర్శించారు. ఇటీవలి దాకా కాంగ్రెస్‌లో వుండి ఆ పార్టీని ముంచారని, బీజేపీ లో చేరి ఆ పార్టీని కూడా ముంచుతున్నారని, వీళ్ళతో కీడే తప్ప రాష్ట్రానికి ఒరిగేది శూన్యమని అన్నారు.

cbn 27062018 2

బీజేపీ, వైసీపీలు దొంగాట ఆడుతున్నా యని, కుట్ర రాజకీయాలకు పాల్ప డుతున్నాయని, లాలూచీ పడ్డాయన్నా రు. ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తామన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా వున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. ఏసీబీ దాడులలోని అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేశామని, ఎర్ర చందనం స్మగ్లర్ల ఆస్తులు కూడా వేలం వేసేందుకు కసరత్తు సాగుతోందని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ నేతలు మాత్రం వైసీపీతో కలిసి తిరుగుతున్నారని చెప్పారు. గాలి జనార్దన్‌ రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిల ఆస్తులను వేలం వేయడానికి వెనుకంజ వేస్తున్నారని అన్నారు.

cbn 27062018 3

ధర్మపోరాటం, దళితతేజం కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కడపలో సీఎం రమేష్‌, బీటెక్‌ రవిల దీక్షకు ప్రజలలో మద్దతు పెరిగిందన్నారు. రవి ఆరోగ్యం క్షీణించినప్పటికీ దీక్షను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఉక్కు దీక్షకు మద్దతుగా రెండు రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం కోసం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నా, కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని, ప్రజాస్వామ్యం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని విధితమవుతోందని ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read