ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుభ్రమణ్యం బదిలీ పై, పలు విమర్శలు వస్తున్న వేళ, ఇప్పుడు వస్తున్న వార్తలు, మరింత ఆందోళన కరంగా ఉన్నాయి. ఎల్వీ సుభ్రమణ్యం బదిలీ పై, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ కమిటీ, హర్షం వ్యక్తం చేసింది. అంతే కాదు, ఆల్ ఇండియా, దళిత & క్రైస్తవ సంఘాల సమాఖ్య పేరుతొ మీడియాకు ఈ బదిలీని సమర్ధిస్తూ ఒక లేఖ వదిలారు. లేఖ ఒక్కటే కాదు, ఎల్వీ బదిలీ పై పండుగ చేసుకుంటూ, అందరూ కలిసి కేక్ కట్ చేసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎల్వీ సుభ్రమణ్యంను బదిలీ చేసినందుకు, జగనన్నకు థాంక్స్ అంటూ ఆ లేఖలో ఉంది. అంతే కాకుండా, గవర్నర్, ప్రవీణ్ ప్రకాష్ కు కూడా ధన్యవాదాలు చెప్తూ, ఆ లేఖలో రాసారు. ఎల్వీ బదిలీ అనేది, క్రైస్తవుల ప్రార్థనల చేసిన విజయమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖలో ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగాలు చేస్తున్న దళితులను సామూహికంగా తొలగించడం ఎల్వీ చేసిన పాపం అని పెర్కున్నారు.

lvs 05112019 2

మమ్మల్ని ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టారని, మేము నిరసన తెలిపినా లెక్క చెయ్యలేదని, ఆయన్ను ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉందని, ఎల్వీ ఒక ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏజంట్ అని , ఇలాంటి వాళ్ళని తొలగించి, దళితుల ఆత్మగౌరవం నిలబెత్తారని అన్నారు. అయితే ఇదంతా, ఒక లెటర్ హెడ్ మీద, "ఆల్ ఇండియా, దళిత & క్రైస్తవ సంఘాల సమాఖ్య పేరుతొ", ఈ లెటర్ అంతా చేతి రాతతో ఉంది. అలాగే, కేకు పైన "ఎల్వీ డమాల్ సుబ్బు, గెట్ అవుట్. క్రీస్టియన్ విక్టరీ" అంటూ రాసి ఉన్న కేకు కట్ చేస్తూ, ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎల్వీ బదిలీని సమర్ధిస్తూ, జగన్ కు థాంక్స్ చెప్తూ, వీళ్ళు సంతోషంతో, కేకు కట్ చేసారు.

lvs 05112019 3

అయితే, ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు, కూడా మాట్లాడారు "సీఎస్ ను తొలగించే అధికారం సీయమ్ గారికి ఉన్న ఈ తొలగించిన విధానం సరిగా లేదు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం.". అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. మరో పార్టీ అయిన బీజేపీ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు వీళ్ళ సంబరాలతో, ఇది నిజమేనా అనే అనుమానం కలుగుతుందని, టిడిపి నేతలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read