రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుంటే చాలా మంది నవ్వుతున్నారు... రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ తో, పాలన మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న దొంగలు, 420లు కూడా ఇట్టే దొరికిపోతున్నారు... దొంగలుపడ్డ ఆర్నెల్లకు కాదు, దొంగలు పడ్డ ఆరు నిమషాల్లో పట్టేశారు మన ఆంధ్రా పోలీసులు... దొంగోడు ఇంట్లో దూరి, బీరువా తాళాలు బద్దలు కొడుతూ ఉండగానే, వచ్చి పట్టేసుకున్నారు, ఏలూరు పోలీసులు.. పోలీసులు కనిపించకూడదు...పోలీసింగ్‌ మాత్రమే కనిపించాలి...రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కావాలి అంటూ ముఖ్యమంత్రి చెప్పిన మాటని మొన్న కడప పోలీసులు, ఈ రోజు ఏలూరు పోలీసులు నిజం చేశారు... అందుకే రాష్ట్రంలో ఉన్న గజ దొంగలు, A1లు, A2లు జాగ్రత్త... ఈ స్టొరీ చదవండి..

cbn lhms 03042018

ఈ దొంగ మామూలోడు కాదు... ఆరితేరిన దొంగ... రాత్రి వేళ మోటారు సైకిల్ పైనే వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నేరాలకు పాల్పడతాడు. తెల్లవారేటప్పటికీ ఏమీ తెలియని అమాయకుడిలా తన ఇంట్లోనే ఉంటాడు. ఒకటికాదు.. రెండుకాదు.. ఇలా ఎన్నో నేరాల కు పాల్పడ్డాడు. గతంలో పోలీసులకు చిక్కి జైలు జీవితం అనుభవించాడు. గతేడాది ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైకను అపహరించి దానినే తన నేరాలకు సవారీగా వినియోగిస్తున్నాడు. విజయవాడ కేంద్రంగా ఉంటూ అనేక ప్రాంతాల్లో రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.. చివరకు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్రంపాడులో ఉన్న ఓ ఇంట్లో చోరీ చేయబోగా ఎల్ హెచ్ ఎంఎస్ (లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్) పోలీసులకు పట్టించింది.

cbn lhms 03042018

రాష్ట్రంలో ఎల్ హెచ్ఎంఎస్ ద్వారా గతంలో కడపలో పది నిమిషాల్లో ఒక దొంగను పట్టుకోగా, ఏలూరు పోలీసులు మాత్రం ఆరు నిమిషాల్లోనే పట్టుకుని తమ సత్తా చాటారు. ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు సోమవారం రాత్రి ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సత్రంపాడు విద్యుత్ నగర్లో, వై.ఎల్.వి.మూర్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన తాడేపల్లిగూడెం కోర్టులో పనిచేస్తున్నారు. గత నెల 29వ తేదీ నుంచి సోమవారం ఉదయం వరకు తాము ఇంటికి తాళం వేసి తిరుపతి వెళ్తున్నామని పోలీసులకు ఎల్ హెచ్ఎంఎస్ ద్వారా రిక్వెస్ట్ పెట్టారు. దీంతో త్రీటౌన్ పోలీసులు ఆ ఇంటిలో ఎల్ హెచ్ఎంఎస్ కు సంబంధించిన సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.

ఈనెల ఒకటో తేదీ అర్ధరాత్రి 12.31 గంటలకు ఒక దొంగ ఆ ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే ఎల్ హెచ్ ఎంఎస్ గుర్తించి పోలీసు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చింది. డీఎస్పీ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై ఆరు నిమిషాల్లోనే ఆ ఇంటికి చేరుకుని ఇంటి నుంచి బయటకు పారిపోతున్న దొంగను పట్టుకున్నారు. ఆ దొంగ మచిలీపట్నంకు చెందిన పాత నేరసుడు శొంఠి దుర్గారావు(38) గా గుర్తించారు. ప్రస్తుతం విజయవాడలో ఉంటూ గుడివాడ, బాపట్ల, మచిలీపట్నం, గుంటూరు, చిల్లకల్లు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడని, గతేడాది ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటారు సైకిల్ను అపహరించాడని, అదే మోటారు సైకిల్ పై తిరిగి ఏలూరులో నేరం చేయడానికి వచ్చి పోలీసు కెమెరాకు చిక్కాడని డీఎస్పీ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read