రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజల్లో నానాటికి వ్యతిరేకత పెరిగిపోతుందని, ఎవరిని కదిలించినా చెప్తారు. రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనే మాటే లేదు, ఇక పెరిగిన చార్జీలు, పన్నులు అదనం. ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నారు అంతే. కేవలం రెండున్నరేళ్ళకే ఇలా అయిపోతే, ఇదే సంకేతం ప్రజల్లోకి వెళ్తే, ఇబ్బంది అనుకున్న వైసీపీ నేతలు, మున్సిపల్ ఎన్నికల్లో అడ్డ దారులు తొక్కారు. అయితే వైసీపీ నేతలు కుప్పం మీద పెట్టిన ఫోకస్, ఇతర చోట్ల పెట్టలేదు. దీంతో అక్కడ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉందో అర్ధమై పోయింది. ఈ రోజు 13 మునిసిపాలిటీలలో, వైసీపీ గతంతో పోల్చుకుంటే, ఓటు బ్యాంక్ పొగుట్టుకాగా, టిడిపి గణనీయంగా పెంచుకుంది. దొంగ ఓట్లు, అధికారిక అరాచకాలు చేసినా, టిడిపి భారీగా పుంజుకుంది. అయితే వైసీపీ, బ్లూ మీడియా మాత్రం, కుప్పం దగ్గరే ఆగిపోయి, సంబర పడుతున్నారు కానీ, వారికి పడిన బొక్క మాత్రం చూపించకుండా, జాగ్రత్త పడుతున్నారు. కుప్పంలో అసలు జరిగింది ఎలక్షన్ కాదు సెలక్షన్. ఆ ఎన్నిక అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక మిగతా చోట్ల టిడిపి గట్టిగ పోటీ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో, 98 మునిసిపాలిటీల్లో, టిడిపి కేవలం రెండు మునిసిపాలిటీ గెలిచింది.

eelctoin 17112021 1

ఇప్పుడు 13 మునిసిపాలిటీలలో, టిడిపి రెండు గెలిచింది. జగ్గయ్యపేటలో గెలిచేస్తుంది అనుకున్నా, చివరలో తారు మారు చేసారు. ఇక దాచేపల్లి మొదట టిడిపి గెలించిందని ప్రకటించి, మళ్ళీ రెండు వార్డులు రీ కౌంటింగ్ చేసి, వైసీపీ గెలిచినట్టు చెప్పారు. అలాగే బేతంచెర్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక గతంలో 98 మునిసిపాలిటీల్లో, దాదాపుగా 15 మునిసిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా టిడిపి గెలవలేదు. నేడు 328 వార్డుల్లో ఎన్నికలు జరగగా, దాదాపుగా 100 వార్డులు పైగా టిడిపి గెలిచింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా ఒక వేవ్ కనిపిస్తుంది. స్పష్టమైన వైసీపీ ఎదురీత కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి లో 2019 ఎన్నికలలో వైస్సార్సీపీ 39,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యి, అక్కడ టిడిపి గెలిచింది. ఇక ఇక బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి బుగ్గన ఉండే ప్రాంతంలో కూడా టిడిపి గెలిచింది. అలాగే గుంటూరు నగరంలో కొన్ని నెలలు క్రితం జరిగన ఎన్నికల్లో, వైస్సార్సీపీ సిట్టింగ్ డివిజన్ ని తెలుగుదేశం గెలుచుకుంది. కొన్ని నెలల క్రితమే ఇక్కడ వైసీపీ అభ్యర్ధి వెయ్యి ఓట్ల పైన తేడాతో గెలవగా, నేడు టిడిపి అభ్యర్థి సమత విజయం 537 ఓట్ల తో గెలిచారు. ఇక్కడ మరో అంశం జనసేన కూడా పోటీలో ఉంది, వారికి 400 దాకా వచ్చాయి. మొత్తంగా ఎన్ని అరాచకాలు చేసినా టిడిపి ముందుకు వచ్చింది. వైసీపీ మాత్రం, ఇవేమీ కనిపించకుండా, కుప్పం దగ్గరే ఆగిపోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read