మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.వై.ఆర్ కృష్ణారావు, తను కప్పుకున్న ముసుగు పూర్తిగా తేసేసి, జగన్ ముసుగు కప్పి, అన్ని వదిలేసి లోటస్ పాండ్ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు... పదవి ఇచ్చిన చంద్రబాబు పైనే, కొంత మంది జగన్ పైడ్ ఆర్టిస్ట్ లోతో కలిసి, సోషల్ మీడియాలో అవహేళన చెయ్యటం చూసాం... ఇప్పుడు, ఏకంగా అమరావతి మీద విషం చిమ్ముతున్నాడు, ఈ మహానుభావుడు...
కాకినాడ ఎన్నికల ముందు లోటస్ పాండ్ స్క్రిప్ట్ ప్రకారం, మీడియా ముందుకు వచ్చి అధికార పార్టీపై విమర్శలు చేస్తూ, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు. తాజాగా నిన్న విజయవాడలో ఆయన నిర్వహించిన సదస్సులో రాజధాని అమరావతి పై విషం చిమ్మారు.
అమరావతి 270 ఎకరాలు చాలు, అన్ని ఎకరాలు ఎందుకు అని అడుగుతున్నారు.. అమరావతిలో రాబోయే కాలంలో విపత్తులు వస్తాయి అంటూ బెదిరిస్తున్నారు.. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అంటున్నారు..
నలుగురు ఉండటానికి 32 ఎరకల్లో ఈయన గారి బాస్ కి ప్యాలస్ కావలి... లోటస్ పాండ్ కావలి... 5 కోట్ల మంది గుండెల మీద తన్నిన ఆంధ్రులకి ప్రపంచ స్థాయి రాజధాని వద్దా ? పథకం ప్రకారం, ఒక పార్టీ ఆడించినట్టు ఆడటం, మీ వయసుకి, హోదాకి సబబేనా ?
అంటే ఈయన చీఫ్ సెక్రటరీగా పని చేసినప్పుడు ఎంత కుట్ర పన్నారో తెలుసా ? దొనకొండ రాజధాని కావాల్సిందే అని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు... ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా, రహస్యంగా కేంద్రానికి నివేదించారు అంటే అర్ధం ఏంటి ? దొనకొండలో రాజధాని కావాలని ఏ ఒక్కరూ కోరుకోలా... అక్కడ భూములు పెద్ద ఎత్తున కొనుకున్న జగన్ బ్యాచ్ తప్ప... అంటే, వై.ఎస్.జగన్‌తో సంబంధాలు కొనసాగిస్తూ, ప్రభుత్వ రహస్యాలను ఆయనకు చేరవేశారనేది ఇప్పుడు తెలుస్తుంది... దొనకొండలో అసలు ఏమున్నాయని, ఆయన దొనకొండ రాజధాని కావాలని తపించారు ? ఉత్తరాంధ్ర వారికి, దొనకొండ రాజధాని చేస్తే ఎలా ? దొనకొండలో నీరు ఉందా ?
మరి ఎవరి కోసం, ఆ రోజు ఐ.వై.ఆర్ కృష్ణారావు నాటకం ఆడారు ? చీఫ్ సెక్రటరీగా ఉంటూ, ఇలా ఎన్ని ప్రభుత్వ రహస్యాలు లోటస్ పాండ్ కి చేరవేశారు ? ఇవన్నీ ప్రభుత్వం విచారణ చెయ్యాలి... ఇలాంటి వారు ఎన్ని కుట్రలు చేశారో, చేస్తున్నారో, ప్రభుత్వం తేల్చాలి...
చివరగా ఈయన ఎలా మాట మారుస్తున్నారో, ఎలా లోటస్ పాండ్ ట్యూన్ కి డాన్స్ వేస్తున్నారో చూడండి... అమరావతికి అన్ని ఎకరాలు ఎందుకు, 270 ఎకరాలు చాలు అంటున్నారు... మరి, ఆయన దొనకొండలో 54 వేల ఎకరాలు ఉన్నాయని, అక్కడే రాజధాని చెయ్యాలి అని కేంద్రానికి ఎందుకు నివేదిక పంపారు ?