దివంగత కింజరాపు ఎర్రంనాయుడు కుమార్తె భవానీని సీఎం వైఎస్ జగన్ రెడ్డి టార్గెట్ చేశారా? ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సోదరిపై వైసీపీ పెద్దలు కక్ష సాధింపులకు పాల్పడ్డారా? ఇవేవో గాసిప్స్ కావు. ఎర్రన్న సోదరుడు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించిన కఠోర వాస్తవాలు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అయిన ఎర్రన్న కుమార్తె భవానీని టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనూరాధకి ఓటేయవద్దంటూ వైసీపీ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఓటింగ్ కి గైర్హాజరు కాకపోతే, భవానీ మామ, భర్తలని అరెస్టు చేయిస్తామంటూ వైసీపీ పెద్దల నుంచి వార్నింగ్ ల మీద వార్నింగులు వచ్చాయని అచ్చెన్నాయుడు వివరించారు. అయినా సరే తన అన్న కుమార్తె ధైర్యంగా వచ్చి ఓటేశారని వివరించారు. అంటే టిడిపి నుంచి నలుగురి ఎమ్మెల్యేలను పశువుల్లా కొనడమే కాకుండా, ఉన్న టిడిపి ఎమ్మెల్యేలనూ టిడిపి అభ్యర్థికి ఓటేయకుండా చూడాలని జగన్ రెడ్డి చేసిన కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎర్రన్న కుమార్తె భవానీ భర్త, మామ వ్యాపారాలను బూచిగా చూపించి ప్రతీసారీ వైసీపీ పెద్దలు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారని తెలుస్తోంది. చిట్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు మూయించేస్తామని, సీఐడీతో దాడులు చేయిస్తామని వైసీపీ బెదిరించి, టిడిపి అభ్యర్థికి ఓటేయకుండా చూడాలనే వ్యూహం ఈ సారికి బెడిసికొట్టింది. గత సారి రాజ్యసభ ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్లకుండా వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అంటే అప్పుడు కూడా వైసీపీ బెదిరింపులతోనే ఇలా చేసి వుండొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.
ఎంపీ రామ్మోహన్ అక్కని జగన్ బెదిరించారా? వైసీపీ బెదిరింపులు మాములుగా లేవు...
Advertisements