జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆరు నెలలుగా, అమరావతి పై, అనేక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీల్లో ఒకటిగా చేద్దామని ప్రణాళిక రచించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి, అమరావతిని వ్యతిరేకిస్తూ వచ్చిన జగన్ మొహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అమరావతి పై అదే ధోరణితో వెళ్తున్నారు. అమరావతి పై ప్రభుత్వంలోని అందరూ అనేక ప్రకటనలు చేస్తున్నా, ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి అయితే మాత్రం, ఎప్పుడు ఒక్క మాట కూడా అమరావతి పై మాట్లాడట లేదు. అయితే ఈ రోజు అమరావతి పై అసెంబ్లీలో చర్చ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ర్ రాజధాని పై జగన్ సంచలన ప్రకటన చేసారు. సౌతాఫ్రికా లాంటి దేశానికి మూడు రాజధానులు ఉన్నాయని తెలియజేసిన జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బహుశా మూడు రాజధానులు రావచ్చునని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రానికి మూడు రాజధానిలో ఉండవచ్చని, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే కేవలం అసెంబ్లీ మాత్రమే, అలాగే కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్ట్, విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్, అంటే సెక్రటేరియట్ ఉండే అవకాసం ఉంది అంటూ జగన్ మొహన్ రెడ్డి చెప్పారు. రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, తరువాత పూర్తీ క్లారిటీ వస్తుందని జగన్ మొహన్ రెడ్డి చెప్పారు. అయితే కమిటీ రిపోర్ట్ రాకముందే జగన్ చెప్పటంతో, దాదపుగా కమిటీ రిపోర్ట్ కూడా ఇలాగే వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. అయితే హైకోర్ట్ కర్నూల్ కు వెళ్ళాలి అంటే, సుప్రీం కోర్ట్, కేంద్రం పర్మిషన్ కావాల్సిన అవసరం ఉంది. మరి వారు ఒప్పుకుంటారా ?
అలాగే, సెక్రటేరియట్ విశాఖపట్నంకు వెళ్ళాలి అంటే, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిలో, అది ఇప్పుడు సాధ్యమా అనే అంశం కూడా తెర మీదకు వస్తుంది. అయితే ఇవన్నీ జరిగే పనేనా అనే చర్చ జరుగుతుంది. కేవలం ప్రజల్లో ఇలా చర్చ పెట్టి, హంగామా చెయ్యలా అనే ఉద్దేశమా అనే అభిప్రాయం కలుగుతుంది. ఇవన్నీ ఇలా ఉంటే, 33 వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులను మాత్రం, జగన్ నిర్ణయం ముంచేసి నట్టే. కేవలం అసెంబ్లీ మాత్రమే ఇక్కడ ఉంటే, అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, రోడ్డున పడినట్టే చెప్పాలి. మొత్తానికి, ఎన్నో కలలు కన్న అమరావతి ఇక చరిత్రలో కలిసిపోయే అవకాసం కనిపిస్తుంది.