డ్వాక్రా సంఘాల సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా పసుపు-కుంకుమ మహాసభలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 25న రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకేరోజు ఈ మూడు సభలకు హాజరై స్వయం సహాయక బృంద సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. అమరావతిలో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి ఉదయం 10.30 గంటలకు హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కడప సభకు, సాయంత్రం 3.30 గంటలకు విశాఖ సభకు హాజరు కానున్నారు. సీఎం ఇటీవల పెన్షన్లు రెట్టింపు చేయడంతోపాటు డ్వాక్రా సంఘాలకు భారీగా వరాలు ప్రకటించారు. ఒక్కో డ్వాక్రా మహిళకు మరలా రూ.10వేలు పెట్టుబడి నిధి ఇస్తామని చెప్పారు. దీంతోపాటు ఒక స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనల ద్వారా లబ్ధి పొందుతున్న వర్గాలను స్వయంగా కలిసి మాట్లాడాలని సీఎం ఆకాంక్షించడంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

three meetings 24012019

పాత గ్రూపు సభ్యులకే కాకుండా, ఈ మధ్యకాలంలో ఏర్పడిన అన్ని సంఘాలకు, వాటిలోని సభ్యులకు కూడా ఈ నగదు మొత్తాన్ని ఇవ్వనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఏకకాలంలో చెక్‌ల రూపంలో ఈ నగదును అందించి, మహిళల మోముల్లో చిరునవ్వులు పూయించనుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ కానుక వల్ల జిల్లాలో దాదాపు 6లక్షల14వేల మంది మహిళలకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి సభ్యురాలికి రూ.4వేల విలువచేసే స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద తరహాలో లబ్ధి చేకూర్చుతుండటంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

three meetings 24012019

డ్వాక్రా మహిళల ప్రగతి కోసం సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక దశ నగదును పంపిణీ చేసేశారు. పెట్టుబడి నిధి, చంద్రన్న చేయూత, పసుపు-కుంకుమ కింద నాలుగు విడతల్లో డ్వాక్రా సభ్యులకు చెల్లింపులు చేశారు. తొలి రెండు విడతల్లో రూ.3వేల చొప్పున జమ చేయగా, మలి రెండు విడతల్లో మరో రూ.2వేలను సభ్యురాలి ఖాతాలోకి జమ చేశారు. మొత్తంగా నాలుగు విడతల్లో ప్రతి ఒక్క సభ్యురాలికి రూ.10వేలను వారి ఖాతాలో వేశారు. 2014, మార్చి 31 నాటికి ఉన్న గ్రూపులకు, అందులోని సభ్యులకు మాత్రమే ఎన్నికల హామీలో భాగంగా ఈ నగదును అందించారు. అప్పుడు మొత్తం 56,408 గ్రూపుల్లోని దాదాపు 5లక్షల70వేల మందికి రూ.570 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read