ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి 151 సీట్లు వచ్చాయన మాటే కానీ, అహంకారంతో, అనుభవ లేమితో, అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చేతకాక, 16 నెలలకే బొక్క బోర్లా పడుతూ, ప్రతి రోజు ఏదో ఒక విమర్శ ఎదుర్కుంటూ, చివరకు మంత్రులు కూడా వివాదాస్పదం అవుతూ, జగన్ మోహన్ రెడ్డికి తల నొప్పులు తెచ్చి పెడుతున్నారు. అటు పార్టీ కూడా, ఇవేమీ పట్టించుకోవటం లేదు. అంతా బాగుంది, మేము ఏమి చేస్తే దానికి ప్రజల మద్దతు ఉంది అనే విధంగా, ప్రవర్తిస్తూ, మంత్రులు చేసిన తప్పులు సరి దిద్దే ప్రయత్నం కూడా చెయ్యటం లేదు. 151 సీట్లతో పాటు, నలుగురు టిడిపి ఎమ్మెల్యేలను ఇప్పటికే లాగారు. ఇంత బలంగా ఉన్న వైసీపీ, హాయిగా పవర్ ని ఎంజాయ్ చేస్తూ రాజకీయాలు చెయ్యవచ్చు. కానీ ఎందుకో వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఈ సెప్టెంబర్ నెలలో, వైసీపీ నేతలకు చుక్కులు కనిపించాయనే చెప్పాలి. ఒక్క నెలలో, ముగ్గురు మంత్రులు చేసిన పనులతో, జగన్ మోహన్ రెడ్డికి, లేని పోనీ తల నొప్పులు తీసుకు వచ్చారు. ఆ ముగ్గురు మంత్రులు జయరాం, వెల్లంపల్లి, కొడాలి నాని.

మంత్రి జయరాం కొడుకు, బినామీ పేరుతొ బెంజ్ కారు కొన్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి, ఆధారాలు కూడా చూపించింది. అయితే జయరాం మాత్రం, ముందు రోజు ఆ కారు తమది కాదు, ఆ కారు మేము వాడుతునట్టు చూపిస్తే రాజీనామా చేస్తాం అన్నారు. రెండో రోజు ఆ ఆధారాలు కూడా తెలుగుదేశం చూపించటంతో, ముచ్చట పడి ఎవరో కారు ఇస్తే మా కొడుకు తోలాడు అని చెప్పారు. ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తూనే ఉంది. ఇక ఈ నెల రోజుల్లో దేవాలయాల పై జరుగుతున్న దాడులు విషయంలో, మంత్రి వెల్లంపల్లి టార్గెట్ అయ్యారు. ఆయన వైఖరి కూడా వివాదాస్పదం అయ్యింది. ఇక మంత్రి కొడాలి నాని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచింది, దేవుళ్ళతో మొదలై, ప్రధాని మోడీ దగ్గర ఆపిన తీరుతో, వైసిపీ చాలా నష్ట పోయిందనే చెప్పాలి. అందుకే ఎప్పుడూ తమ తప్పులను సమర్ధించుకునే ప్రయత్నం చేయని వైసీపీ, మొదటి సారి, అది కొడాలి నాని వ్యక్తిగత అభిప్రాయం, హద్దుల్లో ఉండి మాట్లాడాలి అని చెప్పే స్థాయికి వచ్చింది. మొత్తంగా, కేసులతో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వైసీపీ, తాము చేసిన తప్పిదాలతో, వారే ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read