చంద్రబాబు ఇంటి చుట్టూ వరద రాజకీయం నడుస్తుంది. ఒక పక్క కృష్ణా నదీ తీరాన ఉన్న లంకలు మునిగిపోతుంటే, అడిగే నాధుడు లేడు కాని, చంద్రబాబు ఇంటి వద్ద ఎంత వరద వచ్చింది, ఎప్పుడు మునుగుతుంది అని వైసిపీ నేతలకు ఆత్రుతగా ఉంది. దీంతో ఏకంగా ఒక ఎన్ఎస్జీ భద్రత ఉన్న నేత ఇంటి పై, ఎవరి పర్మిషన్ లేకుండా, డ్రోన్ లు తిప్పి, పెద్ద గొడవకు కారణం అయ్యారు. చంద్రబాబు ఇంటి పై మాత్రమే డ్రోన్ తిప్పటంతో, పెద్ద గొడవ అయ్యింది. అయితే ఆ గొడవ చల్లారింది అనుకుంటే, ఇప్పుడు ఏకంగా వైసిపీ మంత్రులు, మేము చంద్రబాబు ఇంటికి వెళ్ళాలి, అక్కడ అన్నీ చూడాలి అని బయలుదేరారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్. ఎమ్మెల్యే మల్లాది విష్ణులు అక్కడకు వచ్చి హల చల్ చేసారు.

undavalli 16082019 2

అయితే అది హైసెక్యూరిటీ ఉన్న ప్రాంతం అని, ఎవరిని పడితే వారిని లోపలకు అనుమతించం అని అక్కడ చంద్రబాబు సిబ్బంది, వారిని అడ్డుకున్నారు. ఇక్కడ పరిస్థితి మేము ఎప్పటికప్పుడు చూస్తున్నాం అని, మీరు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదని అన్నారు. మీకు పర్మిషన్ ఉంటేనే లోపలకు పంపిస్తామని చెప్పారు. అయితే మేము ప్రభుత్వం అని, మేము వెళ్తామని చెప్పటంతో, కుదరదు అని సెక్యూరిటీ వర్గాలు చెప్పాయి. దీంతో మంత్రులు వెనుతిరిగారు. మేము తలుచుకుంటే, మీరెంత ? ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎలా ? కాని మేము అలా వెళ్తే రాజకీయం అంటారు, అందుకే తిరిగి వెళ్తున్నాం. రాత్రికి అధికారులు వస్తారు, వారిని అడ్డుకుంటే మాత్రం, ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

undavalli 16082019 3

అయితే, కేవలం చంద్రబాబు నివాసం టార్గెట్ గా, వైసీపీ ఎందుకు ఇంత గొడవ చేస్తుందో అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఒక పక్క నాలుగు రోజులు నుంచి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కాపలా ఉన్నారని, డ్రోన్ లు తిప్పుతున్నారని, అది కాస్త బయట పడటంతో, ఇప్పుడు ఏకంగా మంత్రులే వచ్చి, మేము చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి చూస్తాం అనటం ఏంటని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇదంతా చూస్తుంటే, ఏదో కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం నేతలు అంటున్నారు. 15 రోజుల నుంచి వరద వస్తుంటే, వాటర్ మ్యానేజ్ మెంట్ సరిగ్గా చెయ్యకుండా, ఈ రోజు చంద్రబాబు ఇల్లు టార్గెట్ గా పెట్టుకుని, లంకలు ముంచుతున్నారని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read