రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వద్దకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులను పంపించింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్, కొద్ది సేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆఫీస్ కు చేరుకొని, ఆయన్ను కలవటం జరిగింది. ఆయనతో పాటుగా, మరో ఇద్దరు ఉన్నత స్థాయి సీనియర్ అధికారులు కూడా హాజరు అయ్యారు, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఈ భేటీలో పాల్గున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముగ్గురు ఉన్నతస్థాయి అధికారుల బృందాన్ని, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వద్దకు పంపించింది. ముఖ్యంగా ఇందులో చూస్తే, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలోనే ఈ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఎన్నికల ప్రొసీడింగ్స్ పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, అన్ని పార్టీలతో ప్రభుత్వంతో సంప్రదించి, అందరి సూచనలు మేరకు, ఈ ఫిభ్రవరిలో ఎన్నికలు జరపటానికి నిర్ణయం తీసుకుని ఎన్నికలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే, రాష్ట్ర ప్రభుత్వం, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళింది. ఆ ప్రక్రియ ఆపేయాలని కోరింది.
ముందుగా ఎన్నికలు నిర్వహణకు ఇప్పుడు వీలు లేదు అంటూ, క-రో-నాని సాకుగా చెప్పింది. అయితే వివిధ రాష్ట్రాలు ఎన్నికలు జరపటం, సుప్రీం కోర్టు కూడా ఇందుకు అనుగుణంగా అక్కడ ఆదేశాలు ఇవ్వటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తన వాదన మార్చింది. క-రో-నా వ్యాక్సిన్ వస్తున్న నేపధ్యంలో, అది ప్రజలకు వేయాలంటే యంత్రాంగం కావాలని, ఇది అన్నిటికంటే పెద్ద ప్రరిక్రియ అని, అందుకే ఇప్పుడు ఎన్నికలు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే దీని పై హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, ప్రభుత్వం ఎన్నికల సంఘంతో కూర్చుని మాట్లాడాలని, వాళ్ళు ఏమి చెప్తున్నారో వినాలని, ఇద్దురూ కూర్చుని మాట్లాడుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులను పంపించాలని కోరింది. హైకోర్టు తీర్పు కాపీ ఇచ్చిన మూడు రోజుల్లోగా, ఈ చర్చలు జరగాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, ప్రభుత్వం ముగ్గురు అధికారులను ఇక్కడకు పంపించింది. ప్రభుత్వ వాదనను, ఈ ముగ్గురు అధికారులు, ఎన్నికల కమీషనర్ కు చెప్పనున్నారు. అయితే రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ఏప్రిల్ లో ఉంటాయని చెప్పటంతో, ఒక పక్క ప్రక్రియ ఇంకా జరుగుతుంటే, విజయసాయి రెడ్డి ఎలా ప్రకటిస్తారు అంటూ విమర్శలు వచ్చాయి. మరి ఈ చర్చలు ఏమి అవుతాయో చూడాలి.