ఈ రోజు తుళ్లూరులో పోలీస్ ల ఓవరాక్షన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తుళ్లూరు పోలీసులపై మంగళగిరి కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐ దుర్గాప్రసాద్ సహా పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశించారు. జరిగిందేంటే, నిన్న రాత్రి ఒక కేసులో నిందితులను అరెస్ట్ చేసారు. జడ్జి ముందు ప్రవేశ పెట్టకముందే వారిని చిత్రహింసలుకు గురిచేసారు. ఆ తరువాత వారిని జడ్జి ముందుకు తీసుకు వెళ్లారు. ఇదే విషయాన్ని నిందితులు కోర్టుకు చెప్పారు. పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసారని జడ్జి ఎదుట చెప్పటంతో వెంటనే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మంగళగిరి కోర్టు జడ్జి ఆదేశించారు. నిందితులను వెంటనే జీజీహెచ్‍కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించగా జీజీహెచ్ వైద్యులు నిందితులకు గాయాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. దీనితో ఆ 8 మంది నిందితుల రిమాండ్ రద్దు చేసి వెంటనే విడుదల చేయాలని జడ్జి ఆదేశాలు జారి చేసారు. నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఆదేశించారు.
పోలీసుల ఓవరాక్షన్ పై, కోర్టు ఆగ్రహం...
Advertisements