రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా బాలనాగిరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని చెట్నేపల్లి, మాధవరం, రచ్చుమర్రి, మాలపల్లి, గ్రామాల్లో ఆయన ప్రత్యేక వాహనంలో రోడ్‌షో నిర్వహించారు. మాధవరం, రచ్చుమర్రి గ్రామాల్లో టీడీపీ ఎంపీ కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తాను గెలుస్తానని తెలిసి ఖగ్గల్ గ్రామం లో ఉద్రిక్త వాతావరణం కల్పించారని ఆరోపిం చారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రి అయినా ఆస్తులు సంపాదించుకోలేదని, ప్రజల మనన్నలు పొందానన్నారు. అటువంటి వ్యక్తులకు గెలుపు ఎల్లప్పుడు వెంటే ఉంటుందన్నారు.
మాధవరంలో ముస్లింలకు షాదిఖానా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. జనం ప్రశాంతం గా ఉండాలనే కోరుకుంటున్నా, బాలనాగిరెడ్డి మాత్రం గొడవలను సృష్టిస్తూ అరాచకాలకు పా ల్పడుతున్నారని అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో రెండు ఓట్లను టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అంతకుముందు రచ్చుమర్రిలో జరిగిన రోడ్‌షోలో తిక్కారెడ్డి, ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువ, కేసీ కెనాల్ పైపులైన్ పూర్తి చేసి రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు ఇస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. మాధవరంలో తిక్కారెడ్డితో కలిసి టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని, అటువంటి వారిని నమ్మొద్దన్నారు.
కోట్ల అంటేనే నమ్మకం అన్నారు. చంద్రబాబు కూడా నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు ఇస్తానన్నారు. దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని చిత్తుగా ఓడించి తిక్కారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తిక్కారెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ, తనయుడు దివాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, గుడిసె శివన్న, పన్నాగ స్వామి, లక్ష్మికాంత్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ముత్తురెడ్డి, సురే్‌షనాయుడు, చావిడి వెంకటేష్, మౌనేశ్వరరెడ్డి, నర్సన్న ఆచారి, అమర్నాథ్రెడ్డి, గువ్వల భీమన్న పాల్గొన్నారు. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డికి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని జిల్లా తెలుగుయువత నాయకుడు దివాకర్‌రెడ్డి అన్నారు. శనివారం కోసిగి మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. తిక్కారెడ్డి ప్రచారంలో ఉండగా, వైసీపీ నేతలు కత్తులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే, ప్రచారం చేస్తున్నారు.