అన్యాయం జరిగింది అంటూ, కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీకి, అతి తక్కువ టైం కేటాయించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుంది మేమే కాబట్టి, మా రాష్ట్ర సమస్యల పైనే అవిశ్వాసం పెడుతున్నాం కాబట్టి, గంట సమయం కేటాయించమని తెలుగుదేశం కోరింది. కానీ, మేడమ్ స్పీకర్ గారు, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తెదేపా కి కేవలం 13 నిమిషాలు, దాన్ని బలపరిచిన కాంగ్రెస్ కి 38 నిమిషాలు మాత్రమే కేటాయించి, అధికార పక్షానికి మాత్రం 3 గంటల 33 నిమిషాలు కేటాయించారు. పార్లమెంట్ ని బుల్దోజ్ చేయటం చెయ్యటంలో మోడీ తరువాతే ఎవరైనా. కనీసం మన వాదన వినిపించుకొనే అవకాశం కూడా లేకుండా, వీరి దుర్మార్గాలు ఎక్కడ బయట పడిపోతాయో అని, ఇలా కేవలం 13 నిమషాలు మాత్రమే ఇచ్చారు.

time 19072018 2

అప్పట్లో, కాంగ్రెస్ బీజేపీలు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రుల గొంతు కోశారు. ఇప్పుడు బీజేపీ తలుపులు తెరిచి 13 నిమిషాలు మాత్రమే కేటాయించి ఆంధ్రుల గొంతు నొక్కుతుంది. ఇలాంటి దుర్మార్గాల మీదే అవిశ్వాసం పెడితే, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. లోక్‌సభ అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. లోక్‌సభలో ఆయా పార్టీల బలాబలాలను బట్టి పార్టీలకు సమయం కేటాయించారు. అత్యధికంగా బీజేపీకి 3:33 గంటలకు కేటాయించగా, కాంగ్రెస్‌కు 38 నిమిషాలు, అన్నాడీఎంకేకు 29 నిమిషాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 27 నిమిషాలు, బీజేడీకు 15 నిమిషాలు, శివసేనకు 14 నిమిషాలు, టీడీపీకి 13 నిమిషాలు, టీఆర్ఎస్‌కు 9 నిమిషాలు, సీపీఎంకు ఏడు నిమిషాలు, సమాజ్‌వాదీ పార్టీకి ఆరు నిమిషాలు, ఎన్‌సీపీకి ఆరు నిమిషాలు, ఎల్‌జేఎస్‌పీకి ఐదు నిమిషాల చొప్పున కేటాయించారు.

time 19072018 3

ఆయా పార్టీలకు ఇచ్చిన సమయంలోపు సభ్యులు సభలో మాట్లాడాల్సి ఉంటుంది. అధికార భాజపా మద్దతు కూడగట్టుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. భాజపా మిత్రపక్షమైన శివసేన ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తామని వెల్లడించింది. చర్చ జరగనున్న సందర్భంగా కాంగ్రెస్‌, భాజపా, ఆప్‌, తెదేపాతో పాలు పలు పార్టీలు ఆయా ఎంపీలందరూ తప్పకుండా సభకు హాజరు కావాల్సిందిగా విప్‌ జారీ చేశాయి. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ చర్చను ప్రారంభించనున్నారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అవిశ్వాసంపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read