నోరు తెరిస్తే ప్రజాస్వామ్యం, స్వేఛ్చ అంటూ మాట్లాడే బీజేపీ నేతలు, ముఖ్యంగా అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే మన ప్రధాని గారు, ఇప్పుడు మీడియా అంటే భయపడి పోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తమకు వ్యతిరేకంగా వార్తా వస్తే తట్టుకోలేక పోతున్నారు. తమకు వ్యతిరేకంగా, పేపర్ లో కాని, ఛానల్ లో కాని వార్తా వచ్చింది అంటే, చిందులు వేస్తున్నారు. మొన్నా మధ్య, హిందీ వార్తా చానెల్ ఏబీపీ న్యూస్ లో, బీజేపీకి, అదీ మోడీకి వ్యతిరేకంగా వార్తా రావటంతో, బీజేపీ పెద్దలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరకు, వీరి ఆగ్రహానికి ఆ ఛానల్ ఎడిటర్-ఇన్-చీఫ్, యాంకర్ ఉద్యోగాలు ఊడిపోయాయి.
ఇందుకోసమే, దేశంలో ఉన్న ప్రముఖ ఛానెల్స్ అన్నీ, మోడీకి లొంగిపోయాయి. మోడీ, అమిత్ షా ను రంజింపచేసే కధనాలు వేస్తూ, వాస్తవానికి దూరంగా రిపోర్టింగ్ చేస్తున్నారు. మేము తోపులం అని చెప్పుకునే కొన్ని జాతీయ ఛానెల్స్ కూడా, లొంగిపోయారు. అయితే, వీరు వాస్తవానికి దూరంగా ప్రసారం చేసే కధనాలు మాత్రం కామెడీ అయిపోయాయి. కనీసం ఏమి ప్రసారం చేస్తున్నామో కూడా, విశ్లేషించకుండా, వీరు వేసే కధనాలతో, నవ్వులాపాలు అవుతున్నారు. నిన్న టైమ్స్ నౌ అనే ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ లో, వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు వెస్తాయో సర్వే వేసారు.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారో చెప్పుకుంటూ వచ్చారు. మిగతా రాష్ట్రాలు మనకు అనవసరంగా కాబట్టి, అవి పక్కన పెడదాం. మన రాష్ట్రానికి వచ్చే సరికి, వారు చూపించిన సర్వే ఫలితాలు చూస్తూ, ముందు షాక్ అయ్యి, తరువాత పగలబడి నవ్వుతారు. ఆ సర్వే ప్రకారం, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మన రాష్ట్రంలో 7 ఎంపీ సీట్లు వస్తాయి అంట.. ఇదే పెద్ద కామెడీ అనుకుంటుంటే, కాంగ్రెస్ కు 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఈ సర్వే వేసే ముందు, కనీసం ఆ ముంబై స్టూడియో నుంచి, ఏ హైదరాబాద్ రిపోర్ట్ ని అడిగినా, ఇది ఎంత కామెడీగా ఉందో చెప్పేవాడు. అసలు కాంగ్రెస్ అనేది, మన రాష్ట్రంలో లేనే లేదు, అలాంటి కాంగ్రెస్, మన రాష్ట్రంలో 3 స్థానాలు గెలుస్తుంది అంట.. ఇక కాంగ్రెస్ సమాధి పక్కనే, గొయ్య తవ్వుకున్న బీజేపీకి, 7 వస్తాయి అంట.. ఈ సర్వే చూపిస్తే, కనీసం అమిత్ షా అయినా నమ్ముతారా ? అలాంటిది ప్రజలు నమ్ముతారని, ఈ జాతీయ మీడియా ఎలా అనుకుంటుందో ? అసలు ఇది జాతీయ మీడియా అని పిలవటానికి కూడా సిగ్గు వేస్తుంది.