తిరుమల వేంకటేశ్వరుడు అంటే కలియుగ దైవం... ప్రతి ఇంట భక్త శ్రద్ధలతో పూజిస్తారు. జగన్ మోహన్ రెడ్డి కూడా స్వామి వారి దర్శనం చేసుకోవటానికి కాలి నడకన తిరుమల వెళ్ళిన సంగతి తెలిసిందే. కాని ఆయన బంధువులు మాత్రం, తిరుమలని అపవిత్రం చేస్తున్నారు. మొన్నటి దాకా ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు తిరుమలని అపవిత్రం చేస్తున్నారని, ఆయనకు స్వామి అంటే భయం, భక్తీ లేదని, పూజారులు అంటే గౌరవం లేదని, ఒక పధకం ప్రకారం ప్రచారం చేసి, చంద్రబాబు పై బురద జల్లి, తిరుమల పవిత్రతను కాపాడేది మేమే అంటూ హడావిడి చేసారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం, అవన్నీ పోయాయి. మళ్ళీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వైఎస్ఆర్ సియంగా ఉండగా, తిరుమల పవిత్రత పాడు చేసారనే అభిప్రాయం అందరిలో ఉంది. జగన్ పై కూడా అలాంటి అభిప్రాయమే ఉన్నా, జగన్ మాత్రం అలాంటి చర్యలు చెయ్యకపోయినా, ఆయన బంధువులు మాత్రం, తిరుమల పవిత్రత పాడు చేస్తున్నారు.

జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మ‌న్ ఇచ్చిన మొదట్లో కొంత వివాదం చెలరేగినా, తరువాత సద్దు మణిగింది. ఇప్పుడు జగన్ బంధువులు తిరుమ‌ల‌లో వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదానికి దారి తీసింది. జగన్ సొంత బాబాయ్ తిరుమ‌ల కొండ పై త‌న జ‌న్మదిన వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌టం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. జగన్‌ బాబాయి, పులివెందుల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డి తన బర్త్ డే పార్టీని ఆదివారం తిరుమలలోని ఓ హోటల్‌లో వైభవంగా జరిపారు. శ్రీవారని దర్శించుకున్న తరువాత, తిరుమలలోని ఓ హోటల్‌లో వైసీసీ నేతల సమక్షంలో మనోహర్‌రెడ్డి తన బర్త్‌డేకు తెచ్చిన కేక్‌ కట్‌ చేసి పార్టీ చేసుకున్నారు. అయితే కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించటం తిరుమలలో నిషిద్దం. తిరుమ‌ల కొండ మీద కేక్‌ల అమ్మ‌కాలు కూడా నిషేధం. అలాంటిది ఆయన కేక్ కొండ పైకి ఎలా తెచ్చారు, ఎవరూ ఎందుకు చెక్ చెయ్యలేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎంతో పవిత్రంగా ఉండే తిరుమలలో అనేక సాంప్రదాయలు ఉంటాయి, వాటిని పాటించాల్సింది మనమే. సియం మావోడు, తిరుమల మా చేతిలో ఉంది అని ఇష్టం వచ్చినట్టు చేస్తే, స్వామికి ఏమి చెయ్యాలో బాగా తెలుసు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read