ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన వెలువడ్డ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతోంది. తిరుపతి నుంచి టీడీపీ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రేపు సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ బృందం కలవనుంది. ఫారం-7, డేటా చోరీ అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈసీని కలవనున్న ఈ బృందంలో మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కాలవ శ్రీనివాసులు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.

tirupati 11032019

తమ కులదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని చంద్రబాబు తెలిపారు. ‘మొదట ఎన్నికల యుద్ధానికి పార్టీ కేడర్‌ను సిద్ధం చేయాలి. ప్రతి జిల్లాలో బూత్‌ కన్వీనర్ల స్థాయి వరకూ వేల మందితో సమావేశాలు నిర్వహిస్తా. ఆ తర్వాత జనంలోకి వెళతా’ అని చెప్పారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం... సీఎం ఈ నెల 16నగానీ, 17నగానీ తిరుపతికి వెళతారు. అదే రోజు శ్రీకాకుళం జిల్లాలోనూ సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.

tirupati 11032019

రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలూ శ్రమిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న తెదేపాకు ఓటేస్తారో? డబ్బుల కక్కుర్తితో, కేసుల మాఫీ కోసం నరేంద్ర మోదీ, కేసీఆర్‌లకు ఊడిగం చేస్తున్న జగన్‌కు ఓటేస్తారో? రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, ప్రజలు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘నేను మీకు సేవ చేశా. మిమ్మల్ని ఓటు అడిగే హక్కు నాకుంది. రాబోయే 30 రోజులు మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మనస్సాక్షిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని కోరారు. ‘మీ భవిష్యత్తు- నా బాధ్యత’ అనేది ఈ ఎన్నికల్లో తమ నినాదంగా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read