రమణ దీక్షితులు ఫ్రెండ్ అయిన క్రైస్తవ మత ప్రచారకుడు బోరుగడ్డ అనిల్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం ధాకలు చేసాడు. శ్రీవారి కైంకర్యాల్లో ఆగమ నియమాలను విస్మరించి అపచారం చేస్తున్నారంటూ తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన అభియోగాలను ఉటంకిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని క్రైస్తవ మత ప్రచారం నిర్వహించే సైమన్ అమృత్ ఫౌండేషన్ ప్రతినిధి, ఆర్పీఐ నాయకుడైన గుంటూరు అరండల్‌పేటకు చెందిన అనిల్‌కుమార్ బోరుగడ్డ, గుజరాత్‌కు చెందిన భూపేంద్ర కె. గోస్వామి సంయుక్తంగా దాఖలు చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రతివాదులుగా చేర్చారు. కనబడకుండా పోయిన స్వామివారి పురాతన నగలపై కమిటీ వేయాలని కోరాడు.
టీటీడీ బోర్డు చూపుతున్న ఆదాయ వ్యయాలు, నేలమాళిగల్లోని రహస్య నిధులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరాడు. తిరుమల తిరుపతి దేవస్థానం, దాని అనుబంధ ఆలయాలను రక్షిత కట్టడాలుగా గుర్తిస్తూ ఈ ఏడాది మే 4న ఆర్కియాలజీ శాఖ జారీచేసిన సర్క్యులర్‌ను పునరుర్ధరించాలని కోరారు. తద్వారా, తిరుమలను కేంద్రం స్వాధీనం చేసుకునేలా చెయ్యాలనే ప్లాన్ వేసారు. కొన్ని రోజుల క్రితం, క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టటంతో, యావత్ హిందూ మతం అవాక్కయింది. ఇప్పుడు ఏకంగా, తిరుమల ఆగమ నియమాల గురించి, ఒక క్రైస్తవ మత ప్రచారకుడు పిల్ వెయ్యటం చూస్తుంటే, దీని వెనుక ఎలాంటి కుట్ర దాగి ఉందో మరి.
గుంటూరుకు చెందిన అనిల్.. సైమన్స్ అమృత్ ఫౌండేషన్ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన... రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. బోరుగడ్డ అనిల్‌పై పలు కేసులు, ఆరోపణలున్నాయి. గత ఏడాది రాజధాని పరిధిలోని తాడికొండ స్టేషన్లో ఆయనపై మారణాయుధాలు కలిగి ఉండటంతోపాటు చీటింగ్ కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలో 2016 ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన ఇంటూరి సురేశ్ బాబును బెదిరించి డబ్బు డిమాండ్ చేశారని, తప్పుడు డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. అనిల్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆయన కారులో మారణాయుధాలు లభించాయి. దీంతో రెండు కార్లను కూడా తాడికొండ పోలీసులు సీజ్ చేశారు. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ, వైఎస్ వై. యెస్. వివేకానంద రెడ్డికి మేనల్లుడు వరుస అని కూడా చెప్పుకుంటూ తిరుగుతాడని, ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ ఈ ప్రచారాన్ని ఖండించలేదని, వైఎస్ ఫ్యామిలీకి ఈయన బంధువు అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు.