ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎప్పుడూ పర్యావరణం గురించి మాట్లాడుతూ ఉంటారు... అందరిలా మాటల్లో కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు... ఇప్పటికే అమరావతిలో ప్రణాళికలు రచిస్తూ ఉండగా, తిరుమలలో మాత్రం ఆచరణలోకి తెచ్చేసారు... కాలుష్య రహిత తిరుమలకు తొలి అడుగు పడనుంది... తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ విడతల వారీగా బ్యాటరీ బస్సులు కానున్నాయి... తిరుమలతో పాటు రాష్ట్రంలోని కీలకమైన రెండు నగరాలకు నడపాలని భావించింది. అయితే ముందుగా తిరుమలలో ఇవి ట్రయిల్ రన్ చేస్తున్నారు... శనివారం నుంచి ఈ బస్సులు ప్రారంభం అయ్యాయి.. ఇవి సక్సెస్ అయితే, ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు..
మొదట 31 సీట్లు కెపాసిటీతో రూపొందించిన ఎలక్ట్రిక్ బస్సును నెలపాటు ఎలాంటి చార్జీ లేకుండా నడపనున్నారు... తరువాత డిమాండ్ ను బట్టి, 40 సీట్లతో రూపొందించిన బస్సులును పూర్తి స్థాయిలో నడపుతారు.. ఈ బస్సుల్లో సెన్సార్లే కీలకం.. డ్రైవర్ తో పాటు 32 మంది కూర్చునే ఈ బస్సు ప్రయాణం ఎంతో సురక్షితం. డ్రైవర్ సీటుతో పాటు ప్రయాణికులు కూర్చునేందుకు మెత్తని అనువైన సీట్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలారం వలన ముందుగానే ప్రమాదాన్ని సెన్సార్లు హెచ్చరిస్తాయి, ఎయిర్ బెలూన్లు, వైఫై, ఎల్ఈడీ లైట్లతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎల్ఈడీ టీవి, ఫైర్ సేఫ్టీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీటన్నంటిని సీసీ కెమెరాల ద్వారా బస్ లోపల పరిస్థితిని డ్రైవర్ పర్యవేక్షిస్తుంటాడు. ఇన్నీ అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ వీటిలో ఏ ఒక్క పరికరం పనిచేయకపోయినా బస్సు ముందుకు కదలదు. అందుకుగల కారణాలను కంప్యూటర్ సెన్సార్ల ద్వారా డ్రైవర్ను ఆలెర్ట్ చేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ స్టోన్ కంపెనీ అతి తక్కువ ఖర్చుతో, ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేశారు. ఇప్పటికే ఇలాంటి తరహా బస్సులను హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నడుపుతున్నారు. దక్షిణ భారత దేశంలో మన రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఎలక్ట్రికల్ బస్సు ప్రత్యేకత... కేవలం మూడు గంటల పాటు విద్యుత తో చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. బరువైన ఇంజన్లు ఉండవు. గేర్ బాక్స్ ఉండదు. కేవలం వెనుక చక్రాలకు సెన్సార్లతో రూపొందించిన మోటారు అమర్చి ఉంటుంది. ఇక డ్రైవర్ సీటుకు ముందు మూడు బటన్లు ఉంటాయి... 'బి' బటన్ ను ప్రెస్ చేస్తే బస్సు ముందుకు కదులుతుంది.. "ఎన్"ను ప్రెస్ చేస్తే న్యూట్రల్ కు చేరుకుంటుది. 'ఆర్'ను ప్రెస్ చేస్తే బస్సు వెనక్కి కదు లుతుంది. ఈ మూడు బటన్లను కంట్రోల్ చేసేందుకు బ్రేక్, క్లచ్లు పనిచేస్తాయి. ఈ బస్సుల వాడకంతో కాలుష్య తీవ్రత తగ్గుతుంది. తిరుపతి ఆర్టీసీ డిపో ఆవరణలో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన రీచార్జ్ స్టేషన్ ఏర్పాటు చేసారు.